icon icon icon
icon icon icon

కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?

కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్‌రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు.

Published : 17 May 2024 04:08 IST

ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక విచారణ
సీఎస్‌పై మండిపడ్డ ఎంపీ బాలశౌరి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్‌రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. జగన్‌ ప్రభుత్వ అరాచక విధానాలకు కొమ్ముకాస్తున్న సీఎస్‌.. అవినీతి బురదలో కూరుకుపోయారని దుయ్యబట్టారు. పోలింగ్‌కు ఒక్క రోజు ముందు నిధుల్ని లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తామని హడావుడి చేసి...నేడు పేదల సొమ్మును దారి మళ్లించాలని చూడటం భావ్యమా? అని గురువారం ఓ ప్రకటనలో నిలదీశారు. ‘‘గతంలోనూ జవహర్‌రెడ్డి.. గుత్తేదారుల నుంచి సొమ్ములు తీసుకొని వారికి బిల్లులు ఇప్పించారు. బినామీ పేర్లతో మైనింగ్‌ అనుమతులు తీసుకోవడం, డి-ఫాం భూముల్ని కొనడం లాంటి ఎన్నో అవినీతి పనులు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు గుత్తేదారులకు చెల్లింపుల పేరుతో సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆయన అవినీతిపై విచారణ చేయిస్తాం. ఆయన్ను ఎవరూ కాపాడలేరు’’ అని బాలశౌరి హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img