icon icon icon
icon icon icon

గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం

‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్‌సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్‌ చేయబోతున్నాం.

Published : 17 May 2024 04:12 IST

దేశం మొత్తం ఏపీని చూస్తుంది
ప్రశాంత్‌కిశోర్‌ కంటే రిషిరాజ్‌ బృందమే సమర్థమైంది
ఐ-ప్యాక్‌ ప్రతినిధులతో భేటీలో సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: ‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్‌సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్‌ చేయబోతున్నాం. జూన్‌ 4న వచ్చే ఎన్నికల ఫలితాలతో దేశమంతా ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తుంది’ అని సీఎం జగన్‌ అన్నారు. ‘ఈ సారి 151కి పైగా అసెంబ్లీ స్థానాల్లో, 22కి పైగా లోక్‌సభ సీట్లలో గెలిచి చరిత్ర సృష్టిస్తాం’ అని చెప్పారు. వైకాపాకు రాజకీయ, ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఐ-ప్యాక్‌ ప్రతినిధులతో విజయవాడలోని ఆ సంస్థ కార్యాలయంలో జగన్‌ గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారితో ఆయన మాట్లాడుతూ.. ‘మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచడంలో గత ఏడాదిన్నరగా మీ (ఐ-ప్యాక్‌) కృషి మాకు ఉపయోగపడింది. గతానికి మించి ఇంకా గొప్ప పాలన అందిస్తాం. రాబోయే రోజుల్లోనూ వైకాపా, ఐ-ప్యాక్‌ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది. ఈ అయిదేళ్లలో రాజకీయంగా ఎన్ని చూశాం. ఐ-ప్యాక్‌లోనూ కొన్ని విభేదాలు వచ్చాయి. ప్రశాంత్‌ కిశోర్‌ ప్రత్యర్థి వైపు వెళ్లి మాట్లాడుతున్నారు. అసలేం జరుగుతోందో చాలామందికి అర్థం కాలేదు. ఏది ఏమైనా రిషిరాజ్‌ సింగ్‌ (వైకాపాకు ఐ-ప్యాక్‌ తరఫున వ్యూహకర్తగా ఉన్న వ్యక్తి) బృందమే సమర్థమైంది’ అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img