icon icon icon
icon icon icon

ఫలితాలను చూసి జగన్‌ షాక్‌ అవుతారు: దేవినేని ఉమా

ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్‌ షాక్‌ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు.

Updated : 17 May 2024 08:53 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్‌ షాక్‌ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. ఓడిపోతారని తెలిసి పార్టీ నాయకులతో మాట్లాడే ధైర్యం లేక..  గెలుస్తున్నామని ఐప్యాక్‌ సంస్థ ప్రతినిధులకు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘జగన్‌ మాటలు నమ్మడానికి ప్రజలెవరూ సిద్ధంగా లేరు. జగన్‌ ఏం చేశారని ఆయన్ని గెలిపిస్తారు? గెలవలేమని తెలిసే సిట్‌ అధిపతి రఘురామిరెడ్డి తప్పుడు పత్రాలను దహనం చేయించారు. నేడు కీలక ఈ ఫైల్‌్్స మాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్‌ మాటలు నమ్మి అధికార దుర్వినియోగానికి పాల్పడే అధికారులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారు. తప్పుచేసిన వారు జైళ్లకు వెళ్లడం ఖాయం’ అని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img