icon icon icon
icon icon icon

కౌంటింగ్‌కు ఏజెంట్లు రారని జగన్‌ భయం: లంకా దినకర్‌

ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్‌ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ విమర్శించారు.

Published : 17 May 2024 04:06 IST

ఈనాడు, అమరావతి: ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్‌ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ విమర్శించారు. 2019 ఎన్నికల్లో తన విజయానికి కారణమని పార్టీ ప్లీనరీలో జగన్‌ పరిచయంచేసిన ప్రశాంత్‌ కిషోర్‌.. ఇప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో వైకాపా చిత్తుగా ఓడిపోతోందని చెప్పారని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం జారీచేసిన ఓ ప్రకటనలో వైనాట్‌ 175 కాదు.. 45 స్థానాల్లో గెలిస్తే గొప్ప అని వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వ స్వార్థ ఓటు రాజకీయాలు ఈసీ ముందు కుదరలేదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img