icon icon icon
icon icon icon

ఎన్నికల పరిశీలకుడు దీపక్‌ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు

‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్‌ మిశ్ర విస్మరించారు.

Published : 17 May 2024 04:05 IST

గవర్నర్‌కు వైకాపా నేతల ఫిర్యాదు

ఈనాడు, అమరావతి: ‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్‌ మిశ్ర విస్మరించారు. తెదేపాకు అనుకూలంగా పోలీసులు నడుచుకునేలా ఆయన వ్యవహరించారు’ అని రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌కు వైకాపా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగు నాగార్జున, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే పేర్ని నాని గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. ‘పల్నాడు ఎస్పీ, గుంటూరు డీఐజీ, అదనపు డీజీ ర్యాంకు అధికారి శంఖబ్రత బాగ్చీ లాంటివారు దీపక్‌ మిశ్ర అండదండలతో తెదేపాకు రాజకీయంగా విజయాన్ని చేకూర్చేలా వ్యవహరించారు. ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన దీపక్‌ మిశ్ర తెదేపా నేత విష్ణువర్ధన్‌రావుతో రహస్యంగా భోజనం చేయడం వంటి వ్యవహారాలూ బయటపడ్డాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోండి’అని అందులో పేర్కొన్నారు. తర్వాత ఆ నేతలు విలేకరులతో మాట్లాడారు. విశాఖపట్నంలో జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు జూన్‌ 9వ తేదీని ప్రాథమికంగా నిర్ణయించినట్లు బొత్స సత్యనారాయణ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img