icon icon icon
icon icon icon

BJP: కేంద్రం ఇచ్చిన నిధులను వైకాపా ప్రభుత్వం వృథా చేసింది: పీయూష్ గోయల్‌

గడిచిన ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏపీని ఎంతో వెనక్కి తీసుకెళ్లిందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated : 25 Apr 2024 15:49 IST

విజయవాడ: గడిచిన ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏపీని ఎంతో వెనక్కి తీసుకెళ్లిందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మద్యం, ఇసుక మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులను వృథా చేశారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వంలో అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం మారబోతోందని చెప్పారు. ప్రతి నెలా దేశంలో ఉన్న పేదలందరికీ ఉచిత రేషన్ అందిస్తున్నామన్నారు. జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించే ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ముద్రా యోజన పథకం ద్వారా స్టార్టప్‌ కంపెనీలకు చేయూతనిస్తున్నట్లు పీయూష్‌ గోయల్‌ వివరించారు.

‘‘ఏపీలో కూటమి విజయం సాధించాలని కోరుకుంటున్నా. రాష్ట్రాభివృద్ధికి ఎన్నో సహజ వనరులున్నాయి. ఈ ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అభివృద్ధిని పట్టించుకోలేదు. ఆ పార్టీ నాయకులు శాండ్‌, ల్యాండ్‌, లిక్కర్‌ మాఫియాలతో రూ.కోట్లు దోచుకున్నారు. ప్రధాని ఆవాస్‌ యోజన కింద 23 లక్షల ఇళ్లు ఏపీకి మోదీ కేటాయించారు. అందులో కేవలం 3.5 లక్షల ఇళ్లే జగన్‌ ప్రభుత్వం నిర్మాణం చేసింది. కేంద్రం ఇచ్చిన రూ.వేల కోట్ల నిధులను దారి మళ్లించారు. విశాఖ రైల్వే జోన్‌ ఇస్తామని విభజన చట్టంలో పెట్టారు.  రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన భూమిని జగన్‌ కేటాయించడం లేదు. ఎన్డీయే కూటమి విజయం సాధిస్తే విశాఖ రైల్వే జోన్‌ సాకారమవుతుంది. పంచాయతీలకు కేటాయించిన నిధులను వైకాపా ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. గ్రామాలను అభివృద్ధి చేయకుండా జగన్‌ సొంత అవసరాలకు ఆ డబ్బులు వాడారు. రాష్ట్రాన్ని అన్నివిధాలా నాశనం చేశారు’’ అని పీయూష్‌ గోయల్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img