icon icon icon
icon icon icon

ప్రజల ఆస్తుల కబ్జాకే ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం

రాష్ట్రంలోని బలహీనవర్గాలు, దళితులు, గిరిజనులు, ఎన్నారైల ఆస్తులను కబ్జా చేయడానికే సీఎం జగన్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం తీసుకొచ్చారని తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఆరోపించారు.

Published : 04 May 2024 05:37 IST

కనకమేడల రవీంద్రకుమార్‌

ఈనాడు, దిల్లీ: రాష్ట్రంలోని బలహీనవర్గాలు, దళితులు, గిరిజనులు, ఎన్నారైల ఆస్తులను కబ్జా చేయడానికే సీఎం జగన్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం తీసుకొచ్చారని తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఆరోపించారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకర్లతో మాట్లాడారు. ప్రజల ఆస్తులను కాజేయడానికే ఈ చట్టం తీసుకొచ్చి.. గెజిట్‌ నోటిఫికేషనూ విడుదల చేసిన వైకాపా ప్రభుత్వం ఇప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో అమలుపై రోజుకో అబద్ధం ఆడుతోందని విమర్శించారు. ప్రజల ఆస్తులను ఎవరి పేరున కావాలంటే వారి పేరున నమోదుచేయడానికి ఈ చట్టం టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌కు అవకాశం కల్పిస్తోందని పేర్కొన్నారు. వీరంతా ప్రభుత్వం నియమించిన అధికారులే కాబట్టి వైకాపా నాయకులు చెప్పినట్లు చేయడం ఖాయమని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఈ కుట్రను గ్రహించి జగన్‌ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్‌ తన రాజకీయ స్వార్థం కోసం వృద్ధులకు ఇంటి దగ్గర పింఛన్లు ఇవ్వకుండా వారి మరణాలను కళ్లచూస్తున్నారని ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img