icon icon icon
icon icon icon

ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలి

అన్ని రాజకీయ పార్టీలనూ సమానంగా చూస్తూ ఎన్నికల్ని నిష్పక్షపాతంగా నిర్వహించాలని రాష్ట్ర అధికారులను... కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నితీశ్‌వ్యాస్‌ ఆదేశించారు.

Published : 04 May 2024 05:38 IST

అన్ని రాజకీయ పార్టీలనూ సమానంగా చూడండి
రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అన్ని రాజకీయ పార్టీలనూ సమానంగా చూస్తూ ఎన్నికల్ని నిష్పక్షపాతంగా నిర్వహించాలని రాష్ట్ర అధికారులను... కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నితీశ్‌వ్యాస్‌ ఆదేశించారు. దిల్లీ ఈసీ కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో), జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులు, వ్యయ పరిశీలకులతో శుక్రవారం ఆయన దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. ‘ఏపీలో చోటుచేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలి. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. రాష్ట్రంలోని నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్‌ బలగాలతో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేయాలి. ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువుల పంపిణీని నియంత్రించాలి’ అని నితీశ్‌వ్యాస్‌ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img