icon icon icon
icon icon icon

తెదేపా మహిళా నేతలపై వైకాపా అసభ్యకర పోస్టులు

Published : 04 May 2024 05:40 IST

రాంగోపాల్‌వర్మకు రూ.1.14 కోట్లు ఎందుకిచ్చారు?
సీఈవోకు ఆనం వెంకటరమణారెడ్డి ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సామాజిక మాధ్యమాల్లో తెదేపా మహిళా నేతలపై అసభ్యకర మార్ఫింగ్‌ ఫొటోలు పెడుతున్న వైకాపా వారిపై చర్యలు తీసుకోవాలని సీఈవో ముకేశ్‌కుమార్‌మీనాను తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి కోరారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని విమర్శించారు. అర్ధ నగ్న చిత్రాలు పోస్టు చేస్తూ... మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వైకాపా మూకలు ప్రవర్తిస్తుంటే మహిళా కమిషన్‌ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈ ఉదంతంలో సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ కూడా భాగస్వామిగా ఉన్నారని ఆరోపించారు. ఈ ఏడాది రెండు దఫాలుగా రాష్ట్ర ఖజానా నుంచి రాంగోపాల్‌వర్మ కంపెనీలకు రూ.1.14 కోట్లు ఎందుకు జమయ్యాయని నిలదీశారు. ఈ మేరకు సీఈవోకు శుక్రవారం ఫిర్యాదు అందించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య చిత్రాలు పెడుతున్నందుకే రాంగోపాల్‌వర్మకు డబ్బు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ‘మార్ఫింగ్‌ చిత్రాలపై చర్యలు తీసుకోవాలని గతంలో ఏలూరు పోలీసు కమిషనర్‌ను సీఈవో ఆదేశించారు. కానీ ఎలాంటి చర్యలూ లేవు. సీఎం జగన్‌ భార్య భారతిరెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకొని.. నిందితులపై చర్యలు తీసుకునేలా చూడాలి’ అని వెంకటరమణారెడ్డి కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img