APSRTC: రాష్ట్రంలో బస్సు సర్వీసులు పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం కర్ఫ్యూ సమయాన్ని సడలించింది. దీంతో  ప్ర్రయాణికుల సౌకర్యార్థం బస్సు సర్వీసులు పెంచాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు బస్సు సర్వీసులు నడపాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Updated : 18 Jun 2021 23:54 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం కర్ఫ్యూ సమయాన్ని సడలించింది. దీంతో ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు సర్వీసులను పెంచాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు బస్సు సర్వీసులు నడపాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రంతో పాటు రాష్ట్రేతర ప్రాంతాలకు పగటి పూట నడిచే దూరప్రాంత సర్వీసులను పెంచాలని సూచించారు. అంతేకాకుండా దూరప్రాంత సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ను పునరుద్ధరించనున్నారు. ఈ క్రమంలో శనివారం నుంచి బస్సుల్లో ముందస్తు టికెట్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయం అందుబాటులోనికి రానుంది. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ బస్సులను తిప్పాలని, తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఎండీ అధికారులను ఆదేశించారు. 
 రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్‌ సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా రాష్ట్రంలో కర్ఫ్యూ వేళలను సడలిస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉండగా.. తాజాగా ఆ సమయాన్ని సడలిస్తూ సాయంత్రం 6 గంటలకు పెంచారు. దీంతో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. రాష్ట్రంలో దుకాణాలు మాత్రం సాయంత్రం 5 గంటలకే మూతపడనున్నాయి. కర్ఫ్యూ సడలింపులతో ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేయనున్నాయి. సడలించిన వేళలు ఈ నెల 21 నుంచి 30 వరకు అమల్లో ఉండనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు