బాసరలో జస్టిస్‌ ఎన్వీ రమణ పూజలు.. మనవరాలికి అక్షరాభ్యాసం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ దర్శించుకున్నారు.

Updated : 16 Oct 2023 12:35 IST

ముథోల్‌ (బాసర): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ఆయనకు ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సరస్వతి దేవికి కుంకుమార్చన, మహాహారతితోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన మనవరాలు నిత్యశ్రీకి బాసరలో జస్టిస్‌ ఎన్వీ రమణ అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఆయనను ఆలయ ఈవో విజయరామారావు, ఛైర్మన్‌ శరత్‌ సన్మానించి తీర్థప్రసాదాలను అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని