TS News: ఎట్టకేలకు బాటసింగారంలో పండ్లమార్కెట్‌ ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా సంక్షేమం ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం బాటసింగారం

Published : 16 Oct 2021 02:36 IST

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా సంక్షేమం ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం బాటసింగారం లాజిస్టిక్స్‌ పార్క్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్‌ ను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ తరలించి బాటసింగారంలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో పెట్టుకుని గడ్డిఅన్నారం నుంచి బాటసింగారం లాజిస్టిక్‌ పార్క్‌లో తాత్కాలిక పండ్ల మార్కెట్‌ ఏర్పాటు చేసిన దృష్ట్యా కమీషన్‌ ఏజెంట్లు సహకరించాలని మంత్రి కోరారు. 

వ్యాపారులంతా సహకరిస్తే వీలైనంత త్వరలోనే కొహెడలో శాశ్వత ప్రాతిపదికన అంతర్జాతీయ ప్రమాణాలతో ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌ నిర్మాణం కార్యరూపం దాలుస్తుందని ప్రకటించారు. అప్పటి వరకు పండ్ల క్రయ, విక్రయాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తొలగించేందుకు సిద్ధమని మంత్రి ప్రకటించారు. ఏ ఒక్క వ్యాపారీ అనుమానం, అపోహలకు గురికావొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని