Andhra News: ఎంపీ, ఎమ్మెల్యేలపై సీబీఐ కేసులు.. అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్‌

గత ఐదేళ్లలో ప్రజాప్రతినిధులపై నమోదైన సీబీఐ కేసులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు డీఓపీటీ శాఖమంత్రి జితేంద్రసింగ్‌ ఈమేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

Updated : 07 Dec 2022 18:55 IST

దిల్లీ: గత ఐదేళ్లలో ప్రజాప్రతినిధులపై నమోదైన సీబీఐ కేసులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు డీఓపీటీ శాఖమంత్రి జితేంద్రసింగ్‌ ఈమేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 2017-2021 మధ్య కాలంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 10 సీబీఐ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఆ తర్వాత స్థానంలో ఒక్కో రాష్ట్రంలో ఆరు కేసులతో ఉత్తరప్రదేశ్‌, కేరళ నిలిచాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌లో 5 కేసులు చొప్పున నమోదు కాగా, తమిళనాడులో నాలుగు కేసులు కొత్తగా వచ్చినట్టు పేర్కొన్నారు. 2017 నుంచి 2022 అక్టోబరు నాటికి దేశ వ్యాప్తంగా 56 సీబీఐ కేసులు నమోదైనట్టు వెల్లడించారు. వాటిలో 22 కేసుల్లో ఛార్జిషీట్‌లు దాఖలు చేసినట్టు తెలిపారు. సీబీఐ కేసులలో 2017లో 66.90శాతం శిక్ష రేటు నమోదు కాగా, 2018లో 68శాతం, 2019లో 69.19 శాతం, 2020లో 69.83శాతం, 2021లో 67.56శాతంగా ఉన్నట్టు డీఓపీటీ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని