Ketamine Therapy: డిప్రెషన్‌కికెటమిన్‌ థెరపీ.. గంటల్లోనే కుంగుబాటు మాయం!

మానసిక కుంగుబాటు మహా చెడ్డది. తీవ్ర ఒత్తిళ్లు.. నిరాశ చుట్టుముట్టినప్పుడు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనను కలుగుతుంటుంది. కుంగుబాటు నుంచి స్వతహాగా లేదా మానసిక నిపుణుల కౌన్సెలింగ్‌ ద్వారా బయటపడే మార్గాలే ఉన్నాయి కానీ.. ప్రత్యేకించి ఔషధాలు పెద్దగా అందుబాటులో

Published : 28 Dec 2021 01:10 IST

లండన్‌: మానసిక కుంగుబాటు మహా చెడ్డది. తీవ్ర ఒత్తిళ్లు.. నిరాశ చుట్టుముట్టినప్పుడు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలుగుతుంటుంది. కుంగుబాటు నుంచి స్వతహాగా లేదా మానసిక నిపుణుల కౌన్సెలింగ్‌ ద్వారా బయటపడే మార్గాలే ఉన్నాయి కానీ.. ప్రత్యేకించి ఔషధాలు పెద్దగా అందుబాటులో లేవు. అయితే, కెటమిన్‌ అనే ఔషధంతో చికిత్స చేయడంపై కొన్నాళ్లుగా పరిశోధకులు దృష్టి సారించారు. కెటమిన్‌ అనేది ఒక మత్తుమందు. దీన్ని అనస్థిషియాలో ఉపయోగిస్తారు. కొందరు అక్రమంగా మాదకద్రవ్యంగానూ వాడుతుంటారు. అయితే, కెటమిన్‌ను సరైన పద్ధతిలో ఉపయోగిస్తే.. మానసిక కుంగుబాటును, ఆత్మహత్య ఆలోచనలను వేగంగా తగ్గించవచ్చని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో తేలింది. 

మానసిక కుంగుబాటుకు గురైన వ్యక్తులకు ఒక్క డోసు కెటమిన్‌ ఇస్తే నాలుగు గంటలలోపే అది సమర్థంగా పనిచేసి కుంగుబాటును తగ్గిస్తుందని పరిశోధకులు గుర్తించారు. దీని ప్రభావం రెండు వారాల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఇది తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు గురయ్యే వ్యక్తులను ఆత్మహత్య ఆలోచనల నుంచి తక్షణమే కాపాడేందుకు దోహదపడుతుందని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఎక్సెటర్‌ పరిశోధకులు తెలిపారు. కెటమిన్‌తో యాక్సైటీ, పోస్ట్‌ ట్రొమాటిక్‌ స్ట్రెస్‌, ఒబ్సెసీవ్‌ కంపల్సీవ్‌ డిజార్డర్‌ వంటి ఎన్నో మానసిక వ్యాధులను నయం చేయొచ్చన్నారు. అయితే, కెటమిన్‌పై పరిశోధనను అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నిర్వహించామని, ఈ ఔషధంతో ప్రతికూల ప్రభావాలూ ఉన్న నేపథ్యంలో దీన్ని సరైన ఔషధంగా అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై మరింత విస్తృత అధ్యయనం చేయాల్సి ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ చికిత్సకి కెటమిన్‌ థెరపీగా నామకరణం చేశారు. ఈ మేరకు కెటమిన్‌ థెరపీపై ‘బ్రిటీష్‌ సైకియట్రీ ఓపెన్‌’ జర్నల్‌లో ఆర్టికల్‌ ప్రచురితమైంది.

Read latest General News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని