Guntur: గుంటూరులో డయేరియా కలకలం.. ఒకరి మృతి

గుంటూరు నగరంలో కలుషిత నీరు తాగి ఒకరు మృతి చెందగా, 10 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 

Updated : 10 Feb 2024 17:49 IST

గుంటూరు: నగరంలో డయేరియా విజృంభించింది. శారదా కాలనీలో మున్సిపల్‌ నీళ్లు తాగి పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో పద్మ అనే మహిళ మృతి చెందగా, మరో 10మంది జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. బాధితులను కమిషనర్‌ చేకూరి కీర్తి, జనసేన, తెదేపా నాయకులు పరామర్శించారు. మూడు రోజుల క్రితం డయేరియాతో సంగడిగుంటకు చెందిన కొర్రపాటి ఓబులు మృతి చెందారు. గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీ నుంచి కలుషిత నీరు సరఫరా అవుతోందని నగర వాసులు ఆరోపిస్తున్నారు.

పద్మ కుటుంబానికి న్యాయం చేయాలంటూ తెదేపా, జనసేన నాయకులు జీజీహెచ్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని తరలించవద్దంటూ నిరసన చేపట్టారు. తాగునీరు సరిగా ఇవ్వలేని కమిషనర్‌ ఎందుకని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని