Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 11 Mar 2024 12:59 IST

1. త్వరలో తెదేపాలో చేరతా: ఎంపీ మాగుంట

ఒంగోలు: త్వరలో తెదేపాలో చేరతానని వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (Magunta Sreenivasulu Reddy) ప్రకటించారు. తన కుమారుడు రాఘవరెడ్డి కూడా ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని చెప్పారు. తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌తో చర్చించి చేరిక తేదీని నిర్ణయిస్తామన్నారు. పూర్తి కథనం

2. తెదేపా నేతలపై అక్రమ కేసులు దుర్మార్గం: ఎమ్మెల్సీ భూమిరెడ్డి

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెదేపా నేతలపై పోలీసుల అక్రమ కేసులు దుర్మార్గమని ఆ పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి విమర్శించారు. కమలాపురం నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో తెలుగుదేశం ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డిపై  హత్యాయత్నం కేసు పెట్టారని తెలిపారు.పూర్తి కథనం

3. యాదగిరీశుడిని దర్శించుకున్న సీఎం రేవంత్‌ దంపతులు

యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) దంపతులు పాల్గొన్నారు. సోమవారం ఉదయం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం ఆలయానికి వెళ్లారు. పూర్తి కథనం

4. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ డీప్‌ఫేక్‌ వీడియో వైరల్‌..

సమాజానికి ముప్పుగా మారుతున్న డీప్‌ఫేక్‌ వీడియోలు, ఫొటోల కట్టడికి కేంద్రం చర్యలు చేపడుతున్నా వీటి బెడద మాత్రం తప్పడం లేదు. మార్ఫింగ్‌ వీడియోలపై ప్రముఖుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) డీప్‌ఫేక్‌ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.పూర్తి కథనం

5. ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకు కాంగ్రెస్‌..

సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషనర్ల (Election Commissioners) నియామకం కొత్త వివాదానికి తెరలేపింది. కేంద్ర ఎన్నికల సంఘం (EC)లో ఖాళీ అయిన కమిషనర్ల పోస్టులను ఈ నెల 15వ తేదీలోగా భర్తీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ వీరిని ఎంపిక చేయనుంది.పూర్తి కథనం

6. రేపటిలోగా ఎన్నికల బాండ్ల వివరాలు ఇవ్వాల్సిందే..: ఎస్‌బీఐకి సుప్రీం ఆదేశాలు

ఎన్నికల బాండ్ల(Electoral Bonds) వివరాల వెల్లడికి భారతీయ స్టేట్‌ బ్యాంకు (ఎస్‌బీఐ) అదనపు సమయం కోరడంపై సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్ర అసంతృప్తి చేసింది. రేపటి (మార్చి 12)లోగా విరాళాల వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. ఈ మేరకు బ్యాంకు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. అలాగే ఆ సమాచారాన్ని మార్చి 15 సాయంత్రం 5 గంటల్లోగా బహిర్గతపర్చాలని ఈసీకి స్పష్టం చేసింది. పూర్తి కథనం

7. కేట్‌ మిడిల్టన్‌ తొలి పోస్ట్‌.. ఆ ఫొటో నిజం కాదా..?

బ్రిటన్‌ (Britain) యువరాజు విలియం సతీమణి, ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కేట్‌ మిడిల్టన్‌ (Kate Middleton) అనారోగ్యం గురించి మరోసారి చర్చ మొదలైంది. తాజాగా రాజకుటుంబం విడుదల చేసిన ఫొటోనే ఇందుకు కారణం. సర్జరీ తర్వాత కేట్‌ తొలిసారి సోషల్‌ మీడియాలో స్పందిస్తూ ఓ ఫొటోను పంచుకున్నారు.పూర్తి కథనం

8. కరడుగట్టిన అల్‌ ఖైదా ఉగ్రవాది మృతి.. అతడి తలపై రూ.40 కోట్ల రివార్డు

ఉగ్రసంస్థ అల్‌-ఖైదా యెమెన్‌ శాఖ నాయకుడు ఖలీద్ అల్-బటర్ఫీ మృతిచెందినట్లు మిలిటెంట్ గ్రూప్‌ ఆదివారం ప్రకటించింది. అతడి మృతికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. అల్‌-ఖైదా (Al Qaida) జెండాలో చుట్టి ఉన్న మృతదేహాన్ని చూపుతూ ఆదివారం ఓ వీడియో విడుదల చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.పూర్తి కథనం

9. ఎయిర్‌టెల్‌లో 2 ప్రీపెయిడ్‌ ప్లాన్ల ధర పెంపు

ప్రముఖ దేశీయ టెలికాం సంస్థ భారత ఎయిర్‌టెల్‌ రెండు ప్రీపెయిడ్‌ ప్లాన్ల (Airtel Prepaid Plans) ధరలను పెంచింది. ఒక్కో యూజర్‌పై వచ్చే సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకోవటంలో భాగంగానే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ.118, రూ.289 ప్లాన్ల ధరలు ఇప్పుడు వరుసగా రూ.129, రూ.329కి చేరాయి.పూర్తి కథనం

10. లైన్‌ అండ్‌ లెంగ్త్‌ మాత్రమే సరిపోదు.. వీడియో ఎనలిస్ట్‌ల వల్లే కఠిన సవాళ్లకు సిద్ధమవుతా: అశ్విన్‌

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో (IND vs ENG) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ రవిచంద్రన్ అశ్విన్. ఐదు మ్యాచుల్లో 156 ఓవర్లు వేసిన అశ్విన్‌ 26 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండుసార్లు 5 వికెట్ల ప్రదర్శన ఉండటం విశేషం. ఈ భారత బౌలర్‌ను ఎదుర్కోవడం ఇంగ్లిష్‌ బ్యాటర్లకు కష్టంగా మారింది. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని