Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 11 Apr 2024 13:03 IST

1. ఓటమి భయంతోనే వైకాపా హింసా రాజకీయాలు: చంద్రబాబు

ఓటమి భయంతోనే వైకాపా హింసా రాజకీయాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఒంగోలులో తెదేపా నేత మోహన్‌రావుపై వైకాపా దాడిని ఆయన ఖండించారు. ‘‘రౌడీయిజం చేయకపోతే పూట గడవదన్నట్లు వైకాపా వ్యవహరిస్తోంది. ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్‌ను ప్రశ్నిస్తే బెదిరిస్తారా?’’ అని ప్రశ్నించారు. పూర్తి కథనం

2. సైనిక స్కూళ్లపై కాంగ్రెస్ ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన కేంద్రం

దేశంలోని సైనిక్‌ స్కూళ్లను ప్రైవేటీకరించే యోచనను కేంద్రం విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. ప్రైవేటీకరణకు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలను రద్దు చేయాలని, ఆ విధానాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని కోరారు.పూర్తి కథనం

3. తితిదే విజిలెన్స్‌ అదుపులో నకిలీ ఐఏఎస్‌ అధికారి

తిరుమలలో నకిలీ ఐఏఎస్‌ అధికారి నరసింహారావును తితిదే విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జాయింట్‌ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనానికి ఆయన సిఫార్సు లేఖ సమర్పించారు. అతడి వైఖరిపై అనుమానంతో ఈవో కార్యాలయ సిబ్బంది విజిలెన్స్‌ అధికారులకు సమాచారం అందించారు.పూర్తి కథనం

4. ఫిష్‌ కామెంట్లకు ఆరెంజ్‌తో చెక్‌..: విమర్శలకు దీటుగా తేజస్వీయాదవ్‌ కౌంటర్

ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) ప్రయాణిస్తున్న సమయంలో భోజనంలో భాగంగా చేప తింటున్నప్పుడు చిత్రీకరించిన వీడియోపై విమర్శలు వ్యక్తమయ్యాయి. వాటికి కౌంటర్ తాజాగా ఆయన షేర్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది.పూర్తి కథనం

5. ఘనంగా రంజాన్‌ వేడుకలు.. భక్తిశ్రద్ధలతో ముస్లింల ప్రార్థనలు

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రంజాన్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముస్లింలు మసీదులకు వెళ్లి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. చిన్నాపెద్దలు పరస్పరం ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.పూర్తి కథనం

6. ఇజ్రాయెల్‌కు 6,000 మంది భారత కార్మికులు!

హమాస్‌తో ఘర్షణల వల్ల ఇజ్రాయెల్‌ (Israel Hamas conflict) నిర్మాణ రంగాన్ని కార్మికుల కొరత వేధిస్తోంది. దీంతో విదేశాల నుంచి శ్రామికులను ఆహ్వానిస్తోంది. అందులో భాగంగా భారత్‌ నుంచి 6000 మంది అక్కడికి చేరుకోనున్నారు. ఏప్రిల్‌, మేలో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వీరిని తరలించనున్నారు.పూర్తి కథనం

7. ఐఫోన్‌ యూజర్లకు హెచ్చరిక.. కిరాయి స్పైవేర్‌తో లక్షిత సైబర్‌దాడులు!

ఫోన్‌ తయారీ సంస్థ యాపిల్‌ (Apple) తమ థ్రెట్‌ నోటిఫికేషన్‌ వ్యవస్థను అప్‌డేట్‌ చేసింది. ‘కిరాయికి తీసుకున్న స్పైవేర్‌’ ద్వారా లక్షిత సైబర్‌ దాడులు జరగొచ్చని తాజాగా హెచ్చరించింది. ఐఫోన్‌ (iPhone) సహా యాపిల్‌ ఉత్పత్తుల్లోకి అక్రమంగా చొరబడే అవకాశం ఉందని ‘ఎఫ్‌ఏక్యూ (FAQs)’లో పేర్కొంది.పూర్తి కథనం

8. గూగుల్‌ ఫొటోస్‌ గుడ్‌న్యూస్‌.. పిక్సెల్‌ ఫోన్లలోని ఈ టూల్స్‌ ఇకపై అందరికీ!

ప్రముఖ ఫొటో ఎడిటింగ్ యాప్‌లన్నీ కృత్రిమ మేధ (Artificial Intellingence) ఆధారిత టూల్స్‌ను అందిస్తున్నాయి. యూజర్లకు మరింత మెరుగైన ఎడిటింగ్‌ ఆప్షన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్‌ ఫొటోస్‌ (Google Photos) సైతం ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.పూర్తి కథనం

9. హార్దిక్‌ సోదరులకు రూ.4.3కోట్ల కుచ్చుటోపీ.. కజిన్‌ వైభవ్‌ పాండ్య అరెస్టు

క్రికెటర్లు హార్దిక్‌ (Hardik Pandya), కృనాల్‌ పాండ్య తమ సమీప బంధువు చేతిలోనే మోసపోయారు. వరుసకు సోదరుడయ్యే వైభవ్‌ పాండ్య (Vaibhav Pandya) వీరికి పార్ట్‌నర్‌షిప్‌ బిజినెస్‌లో దాదాపు రూ.4.3కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టాడు. దీనిపై ఫిర్యాదు చేయడంతో ముంబయి పోలీసు ఆర్థిక నేరాల విభాగం అధికారులు వైభవ్‌ను అరెస్టు చేశారు.పూర్తి కథనం

10. మాతో పెట్టుకోవద్దు.. ప్రత్యర్థులకు శుభ్‌మన్‌ గిల్ హెచ్చరిక

అసాధ్యమనుకున్న విజయాన్ని గుజరాత్‌ తన ఖాతాలో వేసుకుంది. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై గెలిచింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్‌లో రాజస్థాన్‌ తొలి ఓటమిని రుచిచూసింది. ఒకదశలో ఆ జట్టు విజయం ఖాయమని అంతా భావించారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు