Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 07 Feb 2023 17:06 IST

1. Andhra News: ఆంధ్రప్రదేశ్‌ అప్పులు రూ.4,42,442 కోట్లు: కేంద్రం

పార్లమెంటు సాక్షిగా.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అప్పుల చిట్టాను కేంద్ర ఆర్థిక శాఖ మరోసారి బయటపెట్టింది. 2019తో పోలిస్తే ఏపీ అప్పులు దాదాపు రెండింతలు పెరిగాయని కేంద్రం వెల్లడించిది. ఈ మేరకు రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. Turkey Earthquake: ఆ రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపాం: తుర్కియేలోని సిక్కోలు వాసులు

గాఢ నిద్రలో ఊహించని విపత్తు.. కళ్లు తెరిచేలోగా అల్లకల్లోలం.. కళ్లముందే పేకమేడలా కూలిన భవనాలు.. శిథిలాల కింద ఛిద్రమైన వేల జీవితాలు.. ప్రకృతి ప్రకోపానికి అతలాకుతలమైన తుర్కియే (Turkey)లో ఇప్పుడు ఎటు చూసినా కన్పిస్తున్న హృదయ విదారక దృశ్యాలివి..! ఉపాధి నిమిత్తం అక్కడికి వెళ్లిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. అయితే ఈ విపత్తు నుంచి వారు సురక్షితంగా బయటపడ్డారని తెలుసుకుని వారంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. Naga babu: ఆ మేధావులకు ఇదే సమాధానం.. సినీ విమర్శకులపై నాగబాబు స్ట్రాంగ్‌ కౌంటర్‌

సినీ విమర్శకులపై నటుడు, నిర్మాత నాగబాబు(Naga babu) ఘాటుగా స్పందించారు. ఈ మేరకు వారిని ఉద్దేశిస్తూ తన సోషల్‌మీడియా ఖాతాలో వరస ట్వీట్లు చేశారు. సినిమాల వల్ల ప్రేక్షకులకు నష్టం కలుగుతుందని, సమాజంలో చెడు పెరగడానికి సినిమాలే కారణమని విమర్శించే(movie critics) వారికి తన ట్వీట్లతో సమాధానం చెప్పారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. Anil Kumble: భారత క్రికెట్‌లో ఈ రోజు ఓ సంచలనం‌.. కుంబ్లేకు పాక్‌ జట్టు దాసోహమైన వేళ!

భారత(Team India) స్పిన్‌ లెజెండ్‌ అనిల్‌ కుంబ్లే (Anil Kumble) స్పిన్‌ సుడిలో చిక్కుకొని పాక్‌ బ్యాటింగ్‌ పేకమేడలా కూలి నేటికి 24 ఏళ్లు. క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్‌ రికార్డును భారత లెజెండ్‌ సమం చేశాడు. రెండు టెస్టుల సిరీస్‌లో భారత్‌(Team India) తొలిటెస్టులో ఓటమి చవి చూసింది. చెన్నైలో జరిగిన ఆ టెస్టులో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ 136 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా 12 పరుగల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. Buying Home: ఇల్లు కొనేందుకు సిద్ధమేనా? ఎలా తెలుస్తుంది?

సొంతిల్లు (House) కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చాలా మంది జీవిత కాల ఆర్థిక లక్ష్యాల్లో ఇదీ ఒకటి. అయితే ఇల్లు కొనుగోలు చేయడం అంత సులభం కాదు. పెరుగుతున్న ఇళ్ల ధరలతో కావాల్సిన ఏరియాలో కావాల్సిన సదుపాయాలతో ఇంటి కొనుగోలు చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. ఒక్కోసారి ఇంటి కొనుగోలు ప్రణాళిక అయితే చేస్తారు.. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. PM Modi: అలా అనే ధైర్యం ఎవ్వరికీ లేదు : మోదీ

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల (2024 Lok Sabha Elections) కోసం ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే వ్యూహరచన మొదలుపెడుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన విధానాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కూడా తమ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. నేడు దిల్లీలో జరిగిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన మోదీ.. ఎంపీలు ఓటర్లకు చేరువైతే ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉండదన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. British Airlines: ఇంత మోసమా.. ఎంతో ఆశతో విండో సీట్‌ బుక్‌ చేస్తే..!

సాధారణంగా బస్సులు, రైళ్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు బయటకి చూస్తూ ఎంజాయ్‌ చెయ్యొచ్చనే ఉద్దేశంతో ఎక్కువ మంది విండో సీట్‌ (Window seat)నే కోరుకుంటారు. విమానాల్లో (Plane) అయితే విండో సీట్‌కు మరింత క్రేజ్‌. దాని కోసం ప్రత్యేక ఛార్జీలను కూడా వసూలు చేస్తుంటారు. అయితే, ఓ విమాన ప్రయాణికుడికి మాత్రం వింత అనుభవం ఎదురైంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. Pawan Kalyan: జగన్‌కు ‘అప్పురత్న’ ఇవ్వాలి: పవన్‌ ఎద్దేవా

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న అప్పులు.. కొత్త రికార్డులు నమోదు చేసే స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో గడచిన 9 నెలల కాలానికి ఏపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.55,555 కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో జనసేన (Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ట్వీట్‌ చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. Kim Jong Un: 40 రోజుల నుంచి కిమ్‌ జాడ లేదు..!

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌(Kim Jong Un) దాదాపు నెల రోజుల నుంచి బాహ్య ప్రపంచానికి కనిపించడంలేదు. ఈ వారం ఆ దేశ రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో కొరియన్‌ పీపుల్స్‌ ఆర్మీ 75వ వార్షికోత్సవ పరేడ్‌ జరగనుంది. ఈ సమయంలో దేశాధినేత సుదీర్ఘకాలం పాటు కనిపించకపోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఆయన ఆరోగ్యం బాగోలేదని ప్రచారం జరుగుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. Ts High court: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. విచారణ చేసేందుకు సీజే అనుమతి కోరండి: హైకోర్టు

ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తూ ఇచ్చిన తీర్పును రెండు వారాలు నిలిపివేయాలని హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించడంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసేందుకు సిద్ధమవుతోందని.. అందుకోసం సుప్రీంకు వెళ్లేందుకు వీలుగా తీర్పును ఆపాలని సింగిల్‌ జడ్జిని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ కోరారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని