Updated : 27 Jun 2021 13:16 IST

Top Ten News @ 1 PM

1. Imran Khan: మాకూ భారత్‌లానే కావాలి..!

అంతర్జాతీయ సంబంధాల్లో ఒక దేశంతో మరో దేశం పోల్చుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఆ సంబంధాలు మొత్తం.. అవసరాలపైన, జాతీయ ప్రయోజనాల ఆధారంగానే ఉంటాయి. ఈ విషయం పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌  మరిచిపోయినట్లున్నారు. ఆయన ఈ మధ్య ప్రతిదీ భారత్‌తో పోల్చుకొని చూసుకొంటున్నారు. దీంతో కొన్ని సార్లు ఆయనకు షాకులు కూడా తగిలాయి. అయినా తీరులో మార్పు రాలేదు. తాజాగా ఆయన ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్నిఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. WTC Final: యుద్ధం ఓడితే ఎంత పోరాడినా లాభంలేదు 

యుద్ధం గెలవకపోతే ఎంత మందిని ఓడించినా లాభంలేదని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇటీవల ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత జట్టు ఓటమిపై స్పందిస్తూ అతడీ వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీసేన రెండేళ్లుగా పడిన కష్టం.. సాధించిన విజయాలు ఒక్క సెషన్‌తో కనుమరుగయ్యాయని అన్నాడు. తాజాగా ఓ క్రీడా ఛానల్‌తో చోప్రా మాట్లాడాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* WTC Final: కోహ్లీ కన్నా రోహితే మెరుగైన కెప్టెన్‌

3. MAA Election: ఇండస్ట్రీ సమస్యలు ప్రత్యక్షంగా చూశా

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేయడంపై నటుడు మంచు విష్ణు లేఖ రాశారు. ఈ ఏడాది జరగనున్న ‘మా’ అధ్యక్ష పదవికి తాను నామినేషన్‌ వేస్తున్నానని ఆయన తెలిపారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టనష్టాలు, సమస్యలు తనకి బాగా తెలుసని అన్నారు. తెలుగు చిత్రపరిశ్రమకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. ‘ఈ ఏడాది జరగనున్న ‘మా’ అధ్యక్ష పదవికి నేను నామినేషన్‌ వేస్తున్నాను అని మంచు విష్ణు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. RGV: రేవంత్‌ నియామకంపై ఆర్జీవీ ట్వీట్‌

తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని నియమించడం పట్ల ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ హర్షం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి.. సింహంలాంటి వ్యక్తి అని కొనియాడారు. అంతేకాకుండా రేవంత్‌ నియామకంతో చాలాకాలం తర్వాత తనకి కాంగ్రెస్‌ పార్టీపై ఆసక్తి వచ్చిందని తెలిపారు. ఈ మేరకు ఆర్జీవీ తాజాగా ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Shankar: శంకర్‌ ఇంట పెళ్లి సందడి

5. France: అవును.. ఆ రాక్షసుణ్ని కాల్చి చంపా

‘అవును.. నేను అతణ్ని చంపాను. ఒకవేళ నేను ఆ పని చేయకపోతే నా పిల్లలే చేసేవాళ్లు’ అంటూ వలేరీ బాకోట్‌(40) కోర్టులో గర్జించింది. ఆ గళంలో ధిక్కారం కంటే అంతులేని విషాదం నుంచి బయటపడ్డ అబల ఆక్రందన ఉంది. అది విన్న న్యాయస్థానం సానుభూతితో ఆమె దీనగాధను అర్థం చేసుకుంది. నాలుగేళ్ల జైలుశిక్షను ఏడాదికి కుదిస్తూ.. ఆ శిక్షాకాలం కూడా అప్పటికే పూర్తయినందున ‘నువ్విక స్వేచ్ఛాజీవి’ అంటూ శుక్రవారం జూన్‌ 25న బాకోట్‌ను విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. IAF: భారత్‌లో తొలి డ్రోన్‌ దాడి..?

భారత్‌ ఏ విషయంలో ఆందోళన చెందుతోందో ఇప్పుడు అదే వాస్తవ రూపం ధరిస్తోంది. ఉగ్రమూకలు ఇప్పుడు డ్రోన్ల వినియోగం చేపట్టాయి. తాజాగా నేడు జమ్ములోని వాయుసేన ఎయిర్‌ పోర్టులోని హ్యాంగర్లపై జరిగిన దాడికి డ్రోన్లను వినియోగించినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తు వాయుసేన ఆయుధాలకు, వాహనాలకు ఎటువంటి నష్టం జరగలేదు. ఇద్దరు సిబ్బంది మాత్రం స్వల్పంగా గాయపడ్డారు.  భారత్‌లో జరిగిన తొలి డ్రోన్‌ దాడి ఇదే..!  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Bomb Blast: జమ్ము విమానాశ్రయంలో పేలుళ్లు

7. Corona: కొత్తగా 50వేల కేసులు.. 58వేల రికవరీలు..

దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 50 వేల వద్దే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 50,040 కేసులు నమోదు కాగా.. 1258 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. నిన్న 17,77,309 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 57,944 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ 2,92,51,029 మంది కొవిడ్‌ను జయించారు. ఇక రికవరీ రేటు 96.75 శాతానికి పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో బస్సు-కారు ఢీ

శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా దోర్నాల నుంచి వస్తున్న కారు.. శ్రీశైలం నుంచి ధర్మవరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చిన్న ఆరుట్ల సమీపంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కడప జిల్లా పులివెందులకు చెందిన గంగాభవాని, ఆది నారాయణరెడ్డి, సుగుణ, శారద, అశోక్‌రెడ్డిగా గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* AP News: అత్తపై వేడి నూనె పోసిన కోడలు

9. Credit Card: స్కోరు తక్కువున్నా క్రెడిట్‌ కార్డు

ఆన్‌లైన్‌లో రుణాల దరఖాస్తు, క్రెడిట్‌ స్కోరును తెలుసుకునే సేవలను అందించే పైసాబజార్‌.కామ్‌ కొత్తగా ఏర్పాటైన ఎస్‌బీఎమ్‌ బ్యాంక్‌ ఇండియాతో కలిసి స్టెప్‌ అప్‌ క్రెడిట్‌ కార్డును ఆవిష్కరించింది. క్రెడిట్‌ స్కోరు సరిగా లేకపోవడం వల్ల రుణాలు, క్రెడిట్‌ కార్డులు రాని వారికి అర్హతను పెంచేందుకు ఈ కార్డును ఆవిష్కరించినట్లు తెలిపింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ హామీగా ఈ స్టెప్‌ కార్డును అందిస్తుంది. ఈ కార్డును బాధ్యతతో వినియోగించిన వారికి క్రెడిట్‌ స్కోరు పెరిగేందుకు తోడ్పడుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Mayawati: యూపీలో బీఎస్పీ ఒంటరి పోరు!

ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ  ఎన్నికల్లో బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఇతర పార్టీలతో పొత్తు కోసం బీఎస్పీ చర్చలు జరుపుతోందని మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె స్పందించారు. యూపీలో మాజీ మంత్రి ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ నేతృత్వంలోని సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ(ఎస్‌బీఎస్పీ), హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఎంఐఎంతో కలిసి ‘భాగీదారీ సంకల్ప్‌ మోర్చా’ పేరిట మాయావతి కూటమి ఏర్పాటు చేయనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ప్రభుత్వంపై ఎమ్మెల్యేల్లో అసంతృప్తి: రఘురామ

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని