Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
1. హెచ్‌ఐసీసీలో కలకలం.. హాల్లోకి తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు..
హెచ్‌ఐసీసీలో జరుగుతోన్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో కలకలం చోటుచేసుకుంది. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ అధికారులు సమావేశం హాల్లోకి ప్రవేశించడంపై భాజపా నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి పోలీసు సిబ్బందిని గుర్తించి పట్టుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
సీనియర్ నటుడు నరేశ్ (Naresh) కుటుంబ వివాదం మరింత ముదిరింది. మైసూర్‌లోని ఓ హోటల్‌లో నరేశ్-పవిత్రా లోకేశ్(Pavitra Lokesh) కలిసి బస చేస్తున్నారని తెలుసుకున్న నటుడి భార్య రమ్య అక్కడికి చేరుకుని వాగ్వాదానికి దిగారు. తనకు విడాకులివ్వకుండా మరో మహిళని ఎలా పెళ్లి చేసుకుంటారంటూ గొడవ చేశారు. పవిత్రను చెప్పుతో కొట్టేందుకు రమ్య యత్నించగా.. చుట్టుపక్కల ఉన్నవారు అడ్డుకున్నారు. ఈ మొత్తం తతంగంతో నరేశ్, పవిత్ర అక్కడి నుంచి వెళ్లిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. Maharashtra: బలపరీక్ష ‘సెమీ-ఫైనల్’లో శిందే వర్గం విజయం!
మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్పీకర్ పదవికి ఎన్నిక పూర్తయింది. ‘హెడ్ కౌంట్’ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. శివసేన తిరుగుబాటు నేత, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే వర్గం కమలదళంతో చేతులు కలిపిన నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక ఉత్కంఠగా మారిన విషయం తెలిసిందే. భాజపా ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఆయనకు మొత్తం 164 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* భాజపా, శివసేన.. వేర్వేరు అనుకోలేదు: ఫడణవీస్
4. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణహత్య.. గొంతు నులిమి పెట్రోల్ పోసి తగులబెట్టారు!
సంగారెడ్డి జిల్లా జిన్నారంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నారాయణరెడ్డి (25)ని హతమార్చారు. హత్య అనంతరం జిన్నారం అటవీ ప్రాంతంలో యువకుడి మృతదేహాన్ని తగులబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నంబర్ 1లో నారాయణరెడ్డి తన స్నేహితుడితో కలిసి నివసిస్తున్నారు. ఏడాది క్రితం ఓ యువతిని నారాయణరెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. Ukraine Crisis: రష్యాలో భారీ పేలుళ్లు..!
ఉక్రెయిన్ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉన్న రష్యా నగరం బెల్‌గోరోడ్‌లో నేడు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయినట్లు సమాచారం. పేలుడు తీవ్రతకు మొత్తం 11 అపార్ట్‌మెంట్ భవనాలు, 39 నివాస గృహాలు నేలమట్టమయ్యాయి. ఈ దాడిని ఆ ప్రాంత గవర్నర్ గ్లాడికోవ్ ధ్రువీకరించారు. ఈ పేలుళ్ల కారణంగా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిపై ఉక్రెయిన్ నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. 2014 ఘటన తర్వాత అండర్సన్‌కు ఇప్పుడు జ్ఞానోదయమైంది: జడేజా
ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (104) అద్భుత శతకంతో అదరగొట్టేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రిషభ్ పంత్ (146)తో కలిసి 222 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. దీంతో భారత్ 416 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లాండ్ 84/5 స్కోరుతో నిలిచింది. రెండో రోజు ఆట ముగిశాక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రవీంద్ర జడేజా, ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ముందైనా వెళ్లండి.. తర్వాతైనా రండి: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
‘‘భాజపా ఆధ్వర్యంలో పరేడ్ మైదానంలో ఆదివారం జరగనున్న భారీ బహిరంగ సభ నేపథ్యంలో నగరంలో పలుప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నాం.. ట్రాఫిక్ ఆంక్షల అమలుకు ముందైనా మీరు మీ గమ్యస్థానాలు చేరుకోండి.. లేదంటే బహిరంగ సభ పూర్తయ్యాక ఇళ్లకు రండి’’ అంటూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులను కోరారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నందున ఆయా మార్గాల్లో వెళ్లేందుకు అవకాశం.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. Crypto crash: క్రిప్టో క్రాష్.. ఇంకా ఎంత దూరం?
క్రిప్టో కరెన్సీ (CryptoCurrency).. దాదాపు ఏడాది క్రితం అందరి నోళ్లలో నానిన పదం. అసలు ఏంటిది? దీని వెనకున్న సాంకేతికత ఎలా పనిచేస్తుంది? ఎలా మదుపు చేయాలి? దీంట్లో ఇప్పుడు పెట్టుబడి పెట్టకపోతే.. వెనుకబడినట్లేనా? భవిష్యత్తు లావాదేవీలన్నీ క్రిప్టో కరెన్సీల్లో (CryptoCurrency)నే జరగనున్నాయా? ఇలాంటి ప్రశ్నలు అనేక మందిని తొలచివేశాయి. ఈ క్రమంలోనే అనేక క్రిప్టో ట్రేడింగ్ వేదికలూ పుట్టుకొచ్చాయి. కానీ, ప్రస్తుత పరిస్థితులు మాత్రం పూర్తిగా మారిపోయాయి. క్రిప్టో (CryptoCurrency)లో మదుపంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. కరణ్.. అన్‌హ్యాపీ మ్యారేజ్‌కి మీరే కారణం: సమంత
వివాహ బంధాలు బాధాకరంగా ఉండటానికి ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్‌జోహారే(Karan Johar) కారణమని అగ్రకథానాయిక సమంత(Samantha) సరదాగా ఆరోపణలు చేశారు. రీల్‌లో చూసేదానికి రియల్‌గా అనుభవించేదానికి ఎంతో వ్యత్యాసం ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. నటుడు నాగచైతన్యతో(Naga Chaitanya) వైవాహిక బంధానికి స్వస్తి పలికిన అనంతరం సామ్ (SAM) ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. సామ్ ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేసింది? ఎందుకిలా స్పందించిందంటే..? పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. దేశంలో 1.11 లక్షలకు చేరిన యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఆదివారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 16,103 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,35,02,429 చేరింది. వీటిలో క్రియాశీలక కేసుల సంఖ్య 1,11,711గా ఉంది. నిన్న మరో 31 మంది మరణించడంతో మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,25,199కి పెరిగింది. అదే సమయంలో రికవరీ రేటు 98.54 శాతంగా నమోదైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Mahesh Babu: ‘ఆ సహృదయం పేరు మహేశ్ బాబు’.. సూపర్ స్టార్‌కు తారల విషెస్
-
Sports News
ASIA CUP 2022: నేను సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా ఉంటే కచ్చితంగా అతడిని ఎంపిక చేస్తా: మాజీ సెలక్టర్
-
Politics News
Bihar: తేజస్వీతో కలిసి గవర్నర్‌ను కలవనున్న నీతీశ్.. భాజపాకు షాక్ తప్పదా?
-
Politics News
మాధవ్‌పై చర్యలు మొదలు పెడితే వైకాపా సగం ఖాళీ: రామ్మోహన్నాయుడు
-
World News
Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
-
India News
8th Pay Commission: 8వ వేతన కమిషన్‌పై.. కేంద్రం క్లారిటీ..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
- దంపతుల మాయాజాలం.. తక్కువ ధరకే విమానం టిక్కెట్లు, ఐఫోన్లంటూ..
- Raghurama: రాజధాని మార్చే హక్కు లేదని విజయసాయి చెప్పకనే చెప్పారు: రఘురామ
- Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీకి బుమ్రా దూరం.. టీమ్‌ఇండియా జట్టు ఇదే!
- Crime news: వాటర్ బాటిల్ కోసం వివాదం.. వ్యక్తిని రైళ్లోనుంచి తోసేసిన సిబ్బంది!
- Aaditya Thackeray: ఆ ఇద్దరిలో నిజమైన ముఖ్యమంత్రి ఎవరు?.. ఆదిత్య ఠాక్రే