Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 న్యూస్‌

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 11 Nov 2022 13:00 IST

1. TRS MLAs bribery scam: ఫొరెన్సిక్‌ ల్యాబ్‌కు ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు నిందితులు

ఎమ్మెల్యేలకు ఎర కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు రెండో రోజు ప్రశ్నిస్తున్నారు.  చంచల్‌గూడ జైలులో ఉన్న నలుగురు నిందితులను తొలిరోజు రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రశ్నించిన పోలీసులు.. ఇవాళ నాంపల్లిలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ (ఎఫ్ఎస్‌ఎల్‌)కు తీసుకెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Twitter: భారత్‌లో ట్విటర్ ‘బ్లూటిక్‌’ ఛార్జీలు ప్రారంభం.. నెలకు రూ.719

ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న కొద్ది రోజుల్లోనే కీలక మార్పులు చేపట్టిన కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌.. బ్లూటిక్‌కు ఛార్జీలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అమెరికా, యూకే సహా కొన్ని దేశాల్లో ఈ ఛార్జీలు అమల్లోకి రాగా.. తాజాగా భారత్‌లోనూ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. బ్లూటిక్‌ ఛార్జీలపై కొందరు యూజర్లకు సందేశాలు వచ్చాయట. ఇంతకీ మరి భారత్‌లో ఈ సబ్‌స్క్రిషన్‌కు నెలకు ఎంతో తెలుసా..? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. China Corona: షాంఘై లాక్‌డౌన్‌ను మరవకముందే.. మళ్లీ అదేస్థాయిలో కొత్త కేసులు..!

కరోనా మహమ్మారి చైనాను వదలడంలేదు. దశలవారీగా వైరస్ ఆ దేశ ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉంది. వైరస్ కట్టడికి అనుసరిస్తోన్న జీరో కొవిడ్ విధానంతో చైనీయులు విలవిల్లాడుతున్నారు. తాజాగా బీజింగ్‌, జెంగ్‌ఝౌ నగరాల్లో భారీగా కొత్త కేసులు వెలుగుచూశాయి. ఒక్క శుక్రవారమే 10,535 మందికి వైరస్ సోకింది. ఏప్రిల్ 29 తర్వాత ఇవే అత్యధికం కావడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Twitter: ఇలా అయితే ట్విటర్‌ దివాలా తీస్తుంది.. మస్క్‌ హెచ్చరిక!

మరింత ఆదాయాన్ని ఆర్జించడంలో విఫలమైతే ట్విటర్‌ దివాలా (Twitter bankruptcy) తీసే ప్రమాదాన్ని కొట్టిపారేయలేమని ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఉద్యోగులతో అన్నట్లు సమాచారం. అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు సిబ్బంది కష్టపడి పనిచేయాలని.. కంపెనీ ఇచ్చే చిన్న చిన్న ప్రయోజనాలను సైతం వదులుకునేందుకు సిద్ధపడాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. బ్యాడ్‌లక్‌ ఓటమి ఏమాత్రం కాదు.. గణాంకాలు చూస్తే అభిమాని గుండె పగులుతుందేమో..!

వాస్తవానికి ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ అనూహ్యంగా ఏమీ ఓడిపోలేదు. ఎంపికలో కోచ్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ మొండితనం.. ఓటముల నుంచి ఏమాత్రం నేర్చుకొని ఆటగాళ్ల తీరు కలిసి జట్టు అవమానకర రీతిలో ఓటమిని మూటగట్టుకొంది. టీమ్‌ఇండియా ఆడిన గ్రూప్‌-బిలో పాక్‌, దక్షిణాఫ్రికా మినహా మిగిలిన జట్లు మొత్తం పసికూనలే. అయినా కానీ, భారత్‌ సెమీస్‌కు చేరడానికి చెమటోడ్చింది. టోర్నీ మొత్తంలో విరాట్‌, సూర్య, అర్షదీప్‌ రాణించగా.. పాండ్యా కొంత మెరుగ్గా ఆడాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Modi: దక్షిణాదిన ‘వందేభారత్‌’ పరుగులు.. జెండా ఊపిన మోదీ

దక్షిణాది రాష్ట్రాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం బెంగళూరు చేరుకున్నారు. ఈ ఉదయం బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌ ఎయిర్‌బేస్‌కు చేరుకున్న ప్రధానికి కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌, సీఎం బసవరాజ్‌ బొమ్మై, కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషీ తదితరులు స్వాగతం పలికారు. ఆ తర్వాత మోదీ.. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌, భారత్‌ గౌరవ్‌ కాశీ దర్శన్‌ రైలును ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Virat Kohli: భారమైన హృదయంతో బయల్దేరుతున్నాం.. కోహ్లీ భావోద్వేగ ట్వీట్‌

మెగా టైటిల్‌ కల తీరకుండానే మరో పెద్ద టోర్నీలో టీమ్‌ఇండియా ప్రయాణం ముగిసింది. టీ20 ప్రపంచకప్‌ నుంచి రోహిత్‌ సేన అవమానభారంతో నిష్క్రమించింది. ఈ ఓటమి జట్టు ఆటగాళ్లను దుఃఖంలో ముంచెత్తింది. కోట్లాది మంది భారత అభిమానులను నిరాశలోకి నెట్టేసింది. ఈ అసంపూర్ణ ప్రయాణంపై స్టార్‌ బ్యాట్స్‌మెన్‌, టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
 

8. Urban Cruiser: టయోటా అర్బన్‌ క్రూజర్‌ను ఇక కొనలేరు

అర్బన్‌ క్రూజర్‌ ఎస్‌యూవీని తమ కార్ల పోర్ట్‌ఫోలియో నుంచి తొలగిస్తున్నట్లు టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ శుక్రవారం వెల్లడించింది. దీంతో ఇకపై దేశంలో ఈ కారు విక్రయాలు నిలిచిపోనున్నాయి. దీన్ని కంపెనీ 2020 సెప్టెంబరులో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. మారుతీ సుజుకీతో కుదిరిన ఒప్పందంలో భాగంగా మారుతీ విటారా బ్రెజాకు మార్పులు చేసి అర్బన్‌ క్రూజర్‌గా ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు 65 వేల యూనిట్లను విక్రయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో రైలు సేవలకు అంతరాయం

హైదరాబాద్‌ మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. మియాపూర్‌-ఎల్బీ నగర్‌, ఎల్బీనగర్‌-మియాపూర్ మార్గాల్లో సుమారు అరగంటకు పైగా సేవలు నిలిచిపోయాయి. ఆ తర్వాత పునరుద్ధరణ చర్యలు చేపట్టడంతో రైళ్లు తిరిగి బయల్దేరాయి. సేవలకు అంతరాయం కలగడంతో ఆయా మార్గాల్లో వెళ్తున్న రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపేశారు. ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, అమీర్‌పేట్‌ తదితర స్టేషన్లలో రైళ్లు ఆగిపోయాయి. కొన్ని రైళ్లు మార్గంమధ్యలోనూ ఆగినట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని