Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 15 Dec 2022 13:08 IST

1. 40 గంటలకు పైగా యువకుడి నరకయాతన.. రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న అధికారులు

కామారెడ్డి జిల్లాల్లో వేటకు వెళ్లి బండరాళ్ల మధ్య తలకిందులుగా ఇరుక్కుపోయిన యువకుడిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన షాడ రాజు రాళ్లపై నుంచి వెళ్తుండగా సెల్‌ఫోన్‌ పడిపోయింది. దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తూ తలకిందులుగా రాళ్ల మధ్యలోకి జారి ఇరుక్కుపోయాడు. రాజును రక్షించేందుకు పోలీసు, అటవీ, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Rahul sipligunj-sohel: అప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్నా..: సోహైల్

నాటు పాటలు పాడి రికార్డుల మోత మోగించడంలో రాహుల్‌ సిప్లిగంజ్‌(Rahul Sipligunj) తీరే ప్రత్యేకం. ఇక ఆసక్తికరమైన కంటెంట్‌ ఉన్న కథలతో సినిమాలు చేస్తూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయడంలో సోహైల్‌(Sohel) ముందుంటాడు. ట్రెండ్‌కు తగ్గ ఆటపాటలతో అలరిస్తూ యువతకు దగ్గరైన ఈ యువ ప్రతిభావంతులిద్దరూ తమ గురించి.. తమ సినిమాల గురించి ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పంచుకున్నారు. మరీ ఆ ఆటపాటల ముచ్చట్లేంటో చూసేద్దామా..! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Brussels: అరాచకం సృష్టించిన మొరాకో ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌..!

ఫిఫా ప్రపంచకప్‌లో మొరాకో(Morocco) ఓటమి ఐరోపాలోని బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో హింసకు కారణమైంది. నేడు జరిగిన రెండో సెమీఫైనల్స్‌లో ఫ్రాన్స్‌ (France )జట్టు.. మొరాకో(Morocco)ను 2-0తేడాతో ఓడించింది. దీంతో బ్రస్సెల్స్‌లోని మొరాకో(Morocco) ఫ్యాన్స్‌ ఒక్కసారిగా విధ్వంసానికి దిగారు. దాదాపు 100 మందితో కూడిన ఓ అల్లరి మూక విధ్వంసం సృష్టించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. S Jaishankar: లాడెన్‌కు ఆశ్రయమిచ్చిన మీరా మాట్లాడేది..? పాక్‌పై జైశంకర్ ఘాటు విమర్శలు

ఐక్యరాజ్యసమితి (United Nations) భద్రతా మండలిలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన దాయాది పాకిస్థాన్‌ (Pakistan)కు భారత్‌ మరోసారి గట్టిగా బదులిచ్చింది. ఒసామా బిన్‌ లాడెన్‌ (Osama bin Laden) లాంటి భీకర ఉగ్రవాదికి ఆశ్రయం కల్పించిన దేశానికి.. పొరుగు దేశ పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన వారికి ఐరాస(UN) వంటి ప్రపంచ వేదికపై ‘సుద్దులు’ చెప్పే అర్హత లేదని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Kane Williamson: కివీస్‌ టెస్టు కెప్టెన్సీకి కేన్‌ గుడ్‌బై.. నూతన సారథిగా టిమ్‌ సౌథీ

న్యూజిలాండ్‌ స్టార్ క్రికెటర్‌, కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ కీలక నిర్ణయం తీసుకొన్నాడు. ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో జట్టును నడిపించిన కేన్‌.. తాజాగా టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. దీంతో సుదీర్ఘ ఫార్మాట్‌ నాయకత్వ బాధ్యతలను ఫాస్ట్‌ బౌలర్‌ టిమ్‌ సౌథీకి అప్పగిస్తూ కివీస్‌ క్రికెట్‌ బోర్డు నిర్ణయం తీసుకొంది. అతడికి అండగా టామ్‌ లాథమ్‌ను వైస్‌ కెప్టెన్‌గా చేసింది. అయితే, కేన్‌ 2023లో జరిగే వన్డే ప్రపంచకప్‌తోపాటు 2024 టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో జట్టును నడిపించనున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సైరస్ మిస్త్రీ ప్రమాద ఘటన.. ఇక వంతెనలకు క్రాష్‌ బారియర్లు..!

మూడు నెలల క్రితం ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్‌ మిస్త్రీ (Cyrus Mistry) కారు ప్రమాదంలో అకాల మరణం చెందడం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కారు అతివేగం, సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో పాటు ప్రమాదం జరిగిన వంతెన (Bridges) వద్ద క్రాష్‌ బారియర్లు (Crash Barriers) లేకపోవడం కూడా ఈ దుర్ఘటనకు ఓ కారణమని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే వంతెనల వద్ద వాహనాల భద్రతా ప్రమాణాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Kalpika Ganesh: నా పవర్‌ చూపిస్తే భస్మమైపోతారు.. నటి ధన్య బాలకృష్ణపై కల్పిక షాకింగ్‌ కామెంట్స్‌

నటి ధన్య బాలకృష్ణపై (Dhanya Balakrishna) షాకింగ్‌ ఆరోపణలు చేశారు మరో నటి కల్పికా గణేశ్ (Kalpika Ganesh). ధన్య తనని వివాదానికి ఆహ్వానిస్తోందని అన్నారు. ‘‘ధన్య.. నన్ను వివాదానికి ఆహ్వానిస్తున్నావు. సరే త్వరలో కోర్టులో కలుసుకుందాం. నీ గురించి ఎన్నో విషయాలు బయటపెట్టే సరికి ఇన్నాళ్లు నన్ను బ్లాక్‌ చేసిన నువ్వు.. రాత్రి అన్‌బ్లాక్‌ చేసి వరుసగా కాల్స్‌ చేశావు. భయపడ్డావా? లేదా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Komuravelli Mallanna: సమస్యల నిలయంగా కొమురవెల్లి మల్లన్న ఆలయం

తెలంగాణ సంస్కృతి ఆచారవ్యవహారాలకు ప్రతీక.. కొమురవెళ్లి మల్లికార్జున స్వామి..! ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఆ ఆలయానికి.. స్వరాష్ట్రంలోనూ తగిన ప్రాధాన్యం దక్కడం లేదు. ఏళ్లు గడుస్తున్నా.. సమస్యలు.. అపరిష్కృతంగానే మిగిలిపోతున్నాయి. కోరమీసాల మల్లన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు.. అసౌకర్యాలే స్వాగతం పలుకుతున్నాయి. మూడ్రోజుల్లో స్వామివారి కల్యాణం ఉన్నా.. తాత్కాలిక సౌకర్యాల ఏర్పాట్లు కూడా పూర్తి చేయలేని దుస్థితి నెలకొంది. వీడియో కోసం క్లిక్‌ చేయండి

9. Veera Simha Reddy: ‘సుగుణ సుందరి’ వచ్చేసింది..!

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ(Balakrishna), శ్రుతిహాసన్‌ (Shruti Haasan) జంటగా నటిస్తోన్న చిత్రం ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy). గోపీచంద్‌ మలినేని దర్శకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈసినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ షురూ చేసింది. ఇందులో భాగంగా గురువారం ‘సుగుణ సుందరి’ పాట విడుదల చేసింది. ‘సీమా కుట్టిందే.. సిట్టి సీమా కుట్టిందే.. దిల్లు కందిపోయే లాగా దిట్టంగా కుట్టిందే’ అంటూ సాగే ఈ పాట మాస్‌ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. వీడియో కోసం క్లిక్‌ చేయండి

10. Nizamabad: పిల్లలతో కలిసి కుటుంబం ఆత్మహత్యాయత్నం.. భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం

నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయిలు(40), భార్య రేఖ, ఇద్దరు కుమారులు చరణ్‌, అరుణ్‌లతో కలిసి బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని