Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. వాయుసేనకు భారీ నష్టం.. ఒకేరోజు కూలిన మూడు యుద్ధవిమానాలు
భారత వాయుసేన (IAF)కు గట్టి దెబ్బ తగిలింది. గంటల వ్యవధిలో వేర్వేరు చోట్ల మూడు యుద్ధ విమానాలు కుప్పకూలాయి. మధ్యప్రదేశ్‌లో శిక్షణలో ఉన్న రెండు ఫైటర్ జెట్లు కూలిపోగా.. రాజస్థాన్‌లో మరో యుద్ధవిమానం ప్రమాదానికి గురైంది. రోజువారీ శిక్షణలో భాగంగా మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి గాల్లోకి ఎగిరిన సుఖోయ్-30 (Sukhoi-30), మిరాజ్ 2000 (Mirage) విమానాలు కాసేపటికే మొరెనా ప్రాంతంలో కూలిపోయినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. అర్ష్‌దీప్ ఎనర్జీ అంతా అక్కడే వృథా అవుతోంది: భారత మాజీలు
గత సంవత్సరం తన సంచలన బౌలింగ్‌తో అదరగొట్టిన భారత యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్.. కొత్త ఏడాదిలో మాత్రం తడబాటుకు గురికావడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో నో బాల్స్ వేసి ఒక్కసారిగా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్‌తో సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లోనూ అర్ష్‌దీప్ భారీగా పరుగులు సమర్పించాడు. నాలుగు ఓవర్లలో ఒక వికెట్ తీసి 51 పరుగులు ఇచ్చాడు. అందులోనూ ఒక నోబాల్ ఉండటం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. కాంగ్రెస్‌లో విలీనమా.. అదేం లేదు: వెబ్‌సైట్ హ్యాక్ అయిందన్న కమల్ పార్టీ
తమ పార్టీ వెబ్‌సైట్ హ్యాక్ అయినట్లు మక్కల్ నీది మయ్యమ్(MNM) వెల్లడించింది. ప్రముఖ నటుడు కమల్ హాసన్(Kamal Haasan) ప్రారంభించిన ఈ పార్టీ.. కాంగ్రెస్(Congress)లో కలిసిపోనుందంటూ ఆ వెబ్‌సైట్‌లో సందేశం దర్శనమిచ్చింది. దీనివల్లే హ్యాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విలీనం సందేశాన్ని ఎంఎన్‌ఎం ఖండించింది. ‘2024 ఎన్నికల నిమిత్తం జనవరి 30, 2023 నాటికి మక్కల్ నీది మయ్యమ్ అధికారికంగా కాంగ్రెస్‌లో విలీనం అవుతుంది’ అని ఓ సందేశం వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. రివ్యూ: అయలీ.. దేవత దర్శనం ఆ అమ్మాయిలకేనా?
తమిళనాడులోని వీరపన్నై గ్రామ దేవత అయలీ. రజస్వలకాని అమ్మాయిలు తప్ప మరెవరూ ఆ దైవాన్ని దర్శించుకోకూడదు, పుష్పవతి అయిన వెంటనే వారికి పెళ్లి చేసేయాలి, పెద్దగా చదువుకోకూడదు.. అనేవి ఆ ఊరి కట్టుబాట్లు. ఈ సంప్రదాయాన్ని అగౌరవపరిచి ఓ అమ్మాయి ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందని, అందుకే అమ్మవారు ఆగ్రహించి ఊరిని నాశనం చేసిందని భావించిన వీరపన్నై గ్రామస్థులంతా వేరే ప్రాంతానికి తరలివెళ్తారు. కొత్తగా నిర్మించుకున్న ఊరిలోనూ అయలీ మందిరాన్ని ఏర్పాటు చేస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. వైకాపా చేసేది సామాజిక అన్యాయమే: లోకేశ్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం నలగామపల్లిలో ఆయన పాదయాత్ర సాగుతోంది. యాత్రలో భాగంగా ప్రజల విజ్ఞప్తులను లోకేశ్ స్వీకరిస్తున్నారు. మధ్యలో నిర్మాణాలు నిలిపివేసిన కురుబ, వాల్మీకి వర్గాలకు చెందిన సామాజిక భవనాలను ఆయన పరిశీలించారు. ఈ భవనాలను పూర్తి చేయాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు లోకేశ్ దృష్టకి తీసుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. నీరు, నెత్తురు కలిసి ప్రవహించలేవు: ‘సింధూ జలాల’పై ఆనాడే హెచ్చరించిన మోదీ
భారత్ (India), పాకిస్థాన్ మధ్య ఆరు దశాబ్దాలుగా ఉన్న ‘సింధూ జలాల ఒప్పందాన్ని (ఐడబ్ల్యూటీ)’ మార్చేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు పాక్‌కు నోటీసు కూడా జారీ చేసింది. అయితే ఈ ఒప్పందాన్ని (Indus water treaty) సవరించాలన్న నిర్ణయం ఈ నాటిది కాదు. 2016లోనే మోదీ సర్కారు దీనిపై పునరాలోచన చేసినట్లు తెలుస్తోంది. ఉరిలోని సైనిక క్యాంప్‌పై ఉగ్రదాడి తర్వాత సింధూ జలాల ఒప్పంద సమీక్షలో భారత ప్రధాని మోదీ (Modi) మాట్లాడుతూ.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. అదే మా కొంప ముంచింది..: హార్దిక్ పాండ్య
వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి ఉత్సాహంతో టీ20 సిరీస్ బరిలోకి దిగిన హార్దిక్ పాండ్య నాయకత్వంలోని టీమ్‌ఇండియాకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. రాంచీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌పై న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ, సూర్య కుమార్ కీలక ఇన్నింగ్స్ ఆడటం మినహా భారత బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో విఫలం కావడం కలవరానికి గురి చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. నిజమే విజయ్‌తో నాకు మాటల్లేవు కానీ..
తనకి తన కుమారుడు విజయ్ (Vijay)కు మధ్య గడిచిన ఏడాదిన్నరగా సరిగ్గా మాటల్లేవనే విషయం నిజమేనని నటుడి తండ్రి చంద్రశేఖర్ (Chandrasekhar) స్పష్టం చేశారు. అయితే అదేమీ చర్చించుకోవాల్సినంత పెద్ద అంశం కాదని అన్నారు. తండ్రీకొడుకులన్నాక చిన్న చిన్న మనస్పర్థలు రావడం.. తిరిగి కలుసుకోవడం సహజమని తెలిపారు. ఈ మేరకు తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని విజయ్ గురించి మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ద్వారా తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు పలు అంశాలను ప్రస్తావిస్తూ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. ‘‘వివేకా హత్య కేసు విచారణ పారదర్శకంగా జరగాలి. విచారణను రికార్డు చేసేందుకు అనుమతించాలి. నాతో న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలి’’ అని లేఖలో పేర్కొన్నారు. అయితే అవినాష్ లేఖకు సీబీఐ ఇంకా సమాధానం ఇవ్వలేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. మోదీజీ.. 5 ట్రిలియన్ డాలర్ల కలలో కీలక భాగస్వామిని మరవొద్దు..!
జనాభాలో సగం మహిళలే ఉంటారు. కానీ, భారత్‌లో కట్టుబాట్ల కారణంగా వీరిలో చాలా మంది ఉద్యోగాలు చేయరు. ఇది ఒక రకంగా ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదు. అభివృద్ధి చెందిన దేశాల జీడీపీలో మహిళల వాటా చాలా ఎక్కువగా ఉంటోంది. 2015 నాటి లెక్కల ప్రకారం చైనా, తూర్పు ఐరోపా, మధ్య ఆసియాలో అత్యధికంగా మహిళలు జీడీపీలో 41 శాతం సమకూరుస్తున్నారు. ఉత్తర అమెరికాలో కూడా 40 శాతం వాటా వీరిదే. ప్రపంచ జీడీపీ సగటులో కూడా 37 శాతం మహిళల నుంచే వస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీ
-
Crime News
చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్‌తో చేరవేత!
-
Sports News
Ambati Rayudu: చివరి మ్యాచ్‌లో రాయుడు మెరుపు షాట్లు.. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ముగింపు
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్