Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. 19వ ఓవర్ ఫోబియా.. మళ్లీ పునరావృతమవుతోందా..?
11 ఓవర్లకు 106/2... ఇదీ ఐపీఎల్ 16వ సీజన్‌లో (IPL 2023) చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT vs CSK) స్కోరు. లక్ష్యం 179 పరుగులే కావడంతో 9 ఓవర్లలో 73 పరుగులంటే పెద్ద ఇబ్బందేం కాదు. అయితే చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో గుజరాత్ లక్ష్యం 18 బంతుల్లో 30 పరుగులకు చేరింది. 18వ ఓవర్ వేసిన యువ బౌలర్ హంగార్గేకర్ కేవలం 7 పరుగులే ఇచ్చి వికెట్ తీశాడు. దీంతో విజయ సమీకరణం 12 బంతుల్లో 23కి చేరింది. అనుభవజ్ఞుడైన దీపక్ చాహర్ కీలకమైన 19వ ఓవర్ వేయడానికి వచ్చాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. బండి సంజయ్, రేవంత్‌రెడ్డికి షర్మిల ఫోన్.. కలిసి పోరాడదామని పిలుపు
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలకు వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ అంశంపై కలిసి పోరాడదామని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఇందుకోసం ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేద్దామని.. ప్రగతి భవన్‌కు మార్చ్ పిలుపునిద్దామని సూచించారు. ‘కేసీఅర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలి.కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను తెలంగాణలో బతకనివ్వరు’ అని షర్మిల అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. భార్య కోసమే కొత్త బడ్జెట్ పాలసీ.. రిషి సునాక్‌పై విమర్శలు
బ్రిటన్ (Britain) ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రిషి సునాక్ (Rishi Sunak)ను విమర్శలు, వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఆయన మరోసారి వివాదాస్పద వార్తల్లో నిలిచారు. ఇటీవల రిషి సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఓ కొత్త పాలసీపై విపక్షాలు మండిపడుతున్నాయి. తన భార్య అక్షతా మూర్తి (Akshata Murty) వ్యాపార ప్రయోజనాల కోసమే ఆ నూతన విధానాన్ని తీసుకొచ్చారంటూ రిషిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. పుట్టపర్తిలో ఉద్రిక్తత.. పల్లె రఘునాథ రెడ్డి కారును ధ్వంసం చేసిన వైకాపా కార్యకర్తలు
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి హనుమాన్ జంక్షన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పుట్టపర్తి అభివృద్ధిపై తెదేపా నేత పల్లె రఘునాథరెడ్డి, వైకాపా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఆ ప్రాంతంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇటీవల నారా లోకేశ్ పాదయాత్ర పుట్టపర్తిలో జరిగింది. ఈ సమయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని, లోకేశ్‌ను విమర్శిస్తూ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. దీనిపై తెదేపా వర్గాలు తీవ్రంగా స్పందించాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఓపెనింగ్.. బీటౌన్ తారల సందడి
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) కలల ప్రాజెక్ట్ ‘ఎన్‌ఎంఏసీసీ’ (నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్) ప్రారంభ వేడుకలు శుక్రవారం రాత్రి ఘనంగా జరిగాయి. ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ కల్చరల్ సెంటర్ ఆరంభోత్సవాలు మూడురోజులపాటు జరగనున్నాయి. మొదటిరోజు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ముకేశ్ అంబానీ కుటుంబసభ్యులు, కాబోయే జంట అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. కళాక్షేత్రలో లైంగిక వేధింపులు.. దద్దరిల్లిన తమిళనాడు
లైంగిక వేధింపుల నిరసనలతో తమిళనాడు(Tamil Nadu) దద్దరిల్లుతోంది. ప్రతిష్ఠాత్మక సంప్రదాయ కళల సంస్థ కళాక్షేత్ర(Kalakshetra) ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఆ సంస్థలోని అసిస్టెంట్ ప్రొఫెసర్, మరో ముగ్గురు ఆర్టిస్టులు( repertory artists) తనపై వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ పూర్వ విద్యార్థిని చేసిన ఆరోపణలు వివాదాస్పదంగా మారాయి. లైంగిక వేధింపులు, బాడీషేమింగ్, దూషణలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కొద్దిరోజులుగా దాదాపు 200 మంది విద్యార్థినులు, విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. మధ్య ఓవర్లలో నెమ్మదించాం.. కనీసం 200 స్కోరు చేయాల్సింది: ధోనీ
తాము బ్యాటింగ్ చేసినప్పుడు స్కోరు 200+ మార్క్‌ను దాటితే బాగుండేదని సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేర్కొన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ (92) క్రీజ్‌లో ఉన్నప్పుడు చెన్నై స్కోరు బోర్డు వేగంగా పరుగులు తీసింది. స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోవడంతో ఒక్కసారి పరుగుల రాక నెమ్మదించి.. భారీ స్కోరు చేయడంలో సీఎస్‌కే విఫలమైంది. బౌలింగ్‌లోనూ ఇంపాక్ట్ ప్లేయర్ తుషార్ దేశ్ పాండే విఫలం కావడం కూడా జట్టు ఓటమికి కారణంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ఇంజినీరింగ్ అద్భుతం.. ఈ మొట్టమొదటి రైల్వే తీగల వంతెన!
జమ్మూలోని (Jammu) రైసీ జిల్లాలో నిర్మిస్తున్న ఈ తీగల వంతెన జమ్మూ-బారాముల్లా మార్గంలోని కాంట్రా-రైసీ సెక్షన్లను కలుపుతుంది. జమ్మూ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఈ బ్రిడ్జి ఉంది. అద్భుతమైన హిమాలయ పర్వతాల మధ్య సుమారు రూ.400 కోట్ల వ్యయంతో నిర్మించారు. కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ దీన్ని అభివృద్ధి చేస్తోంది. ఈ బ్రిడ్జి మొత్తం పొడవు 725 మీటర్లు. అందులో 473.25 మీటర్ల మేర కేబుళ్లుంటాయి. ఈ బ్రిడ్జికి మధ్యలో ఒక పైలాన్ మాత్రమే ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ‘దిల్లీకి వస్తే.. ఏకే-47తో కాల్చేస్తామన్నారు..’: సంజయ్ రౌత్
శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut )కు గ్యాంగ్‌స్టర్ల నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయన ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తనకు ఈ బెదింపులు వచ్చాయని ఆయన ఆరోపించారు. పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా మాదిరిగానే తననూ చంపేస్తామని (death threat) వారు హెచ్చరించారని రౌత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. సిట్ విచారణకు హాజరైన టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి అనితా రామచంద్రన్ ఈరోజు విచారణకు హాజరుకావాలని 160సీఆర్పీసీ కింద సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో అనితా రామచంద్రన్ సిట్ కార్యాలయానికి చేరుకొని విచారణకు హాజరయ్యారు.ఆమె వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
భార్యపై అనుమానంతో.. బిడ్డకు పురుగుల మందు!
-
Ts-top-news News
పీఎం స్వనిధి ఉత్సవాలకు వరంగల్ చాయ్‌వాలా.. సిరిసిల్ల పండ్ల వ్యాపారి
-
Ap-top-news News
Chandrababu-AP CID: చంద్రబాబు నివాసం జప్తునకు అనుమతి కోరిన ఏపీ సీఐడీ
-
Ts-top-news News
Dharani portal: ధరణిలో ఊరినే మాయం చేశారు
-
Sports News
Snehasish Ganguly: ప్రపంచకప్ లోపు కవర్లు కొనండి: స్నేహశిష్ గంగూలీ
-
Politics News
దేవినేని ఉమా వైకాపాకు అనుకూల శత్రువు: వసంత కృష్ణప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు