Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 04 Jun 2023 13:01 IST

1. గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత మృతి

మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌(Katakam Sudarshan) మృతిచెందారు. మే 31న మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో గుండెపోటుతో మృతిచెందినట్లు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ ప్రకటించారు. కటకం సుదర్శన్‌ బస్తర్‌ మావోయిస్టు పొలిటికల్‌ బ్యూరో సెంట్రల్‌ కమిటీలో సభ్యుడుగా ఉన్నారు. ఆయన స్వస్థలం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి. నాలుగున్నర దశాబ్దాల క్రితం ఆయన ఉద్యమంలోకి వెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రమాదం జరగడానికి కారణమిదే: రైల్వే మంత్రి

ఒడిశా రైలు ప్రమాద (Odisha Train Accident) ఘటనకు దారి తీసిన మూల కారణాన్ని కనుగొన్నామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini vaishnaw) తెలిపారు. ‘ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌’లో మార్పు వల్లే ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు వెల్లడించారు. ఘటనా స్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ప్రాణం తీసిన పూచీకత్తు.. చంపేసి పెట్రోల్‌ పోసి తగలబెట్టారు!

అప్పు పూచీకత్తు వ్యవహారం ఓ వ్యక్తి  ప్రాణం తీసింది. వైఎస్‌ఆర్‌ జిల్లా చింతకొమ్మదిన్నెలో చోటుచేసుకుంది. జూన్‌ 1న జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్నేహితుడు తీసుకున్న రూ.15లక్షల అప్పునకు శ్రీకాంత్‌ రెడ్డి అనే వ్యక్తి పూచీకత్తుగా ఉన్నారు. అప్పు తీసుకున్న స్నేహితుడు రుణ దాతలకు తిరిగి ఇవ్వలేదు. దీంతో పూచీకత్తుగా ఉన్న శ్రీకాంత్‌ను అడిగారు. ఈ క్రమంలో ఆయనకు అప్పు ఇచ్చిన వ్యక్తులకు మధ్య వాగ్వాదం జరిగి అది ఘర్షణకు దారి తీసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఎన్డీఆర్‌ఎఫ్‌ను తొలుత అప్రమత్తం చేసింది అతడే..

షాలీమార్‌-చెన్నై కోరమాండల్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి గురైన దాదాపు అర్ధగంటలోపే ఎన్డీఆర్‌ఎఫ్‌ తొలి బృందం ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ఈ బృందం అంత వేగంగా అక్కడకు చేరుకోవడానికి కోరమాండల్‌లో ప్రయాణిస్తున్న ఓ ఎన్డీఆర్‌ఎఫ్‌ జవాన్‌ కారణం. ప్రమాదం జరిగిన నిమిషాల్లోనే జీపీఎస్‌ లొకేషన్‌, ప్రమాదం ఫొటోలను ఉన్నతాధికారులకు చేరవేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భారత పుత్రికలపై ఇదేనా ప్రేమ?

‘జనం ఏమనుకున్నా ఫర్వాలేదు... నేనొక హత్యచేశాను’ అని అదురూబెదురూ లేకుండా మీడియా కెమెరా ముందే ఒప్పుకొన్న ఘనుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌. చట్టం చెవులు కళ్లు నోరు అన్నీ మూసుకుందేమో- అతని మీద ఇంతవరకు ఈగ కూడా వాల్లేదు. సరికదా, నేరచరిత నేతలకు పొర్లుదండాలు పెట్టే మన అతిగొప్ప ప్రజాస్వామ్యంలో బ్రిజ్‌భూషణ్‌ చక్కగా పార్లమెంటు సభ్యుడు కాగలిగాడు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు... ఆరోసారి ఎంపీగా, అధికారపక్షం భాజపా సభ్యుడిగా అతడిప్పుడు భారత ప్రజాస్వామ్య దేవాలయాన్ని పావనం చేస్తున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 హాల్‌టికెట్లు విడుదల

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో టీఎస్‌పీఎస్సీ అందుబాటులో ఉంచింది. గతంలో లీకేజీ కారణంగా రద్దయిన పరీక్ష హాల్‌టికెట్లు చెల్లవని.. కొత్తవి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు తెలిపారు. జూన్‌ 11న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించనున్నారు. 503 పోస్టులకు గాను 3.80లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రైలు ప్రమాదంపై సుప్రీం కోర్టులో పిల్‌..

ఒడిశాలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి గురైన ఘటనపై సుప్రీం కోర్టులో ప్రజాహిత వాజ్యం దాఖలైంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 290 మందికిపైగా మరణించగా.. 1,100 మంది గాయపడిన విషయం తెలిసిందే.  ఈ ఘటన నేపథ్యంలో రైల్వేలో రిస్క్‌ అండ్‌ సేఫ్టీ కొలమానాలను విశ్లేషించి సూచనలు జారీ చేసేలా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఈ పిటిషన్‌లో కోరారు. సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో నిపుణులను సభ్యులుగా ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి డైరెక్షన్స్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 1,000 మంది సిబ్బంది.. భారీ యంత్రాలతో ట్రాక్‌ పునరుద్ధరణ..

బాలేశ్వర్‌లో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైన ప్రదేశంలో పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుక భారీ సంఖ్యలో అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. దాదాపు 1,000 మంది రైల్వే సిబ్బంది,  ఏడు పాకెటింగ్‌ యంత్రాలు,  భారీ రైల్వే క్రేన్‌, నాలుగు రోడ్‌క్రేన్లు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. బాలేశ్వర్‌లో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించడమే లక్ష్యంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ 288 మృతదేహాలను వెలికి తీయగా.. 1,100 మంది గాయపడినట్లు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ప్రపంచంలోనే గుండ్రని సరస్సు.. దాని ప్రత్యేకతలు తెలుసా!

సరస్సులు విభిన్న ఆకారాల్లో కన్పిస్తుంటాయి. అయితే ఫ్లోరిడాలోని (Florida) ‘కింగ్స్‌లీ’ (kingsley lake) లేక్‌ మాత్రం గుండ్రంగా.. చూడ ముచ్చటగా దర్శనమిస్తుంటుంది. దీనిని ‘సిల్వర్‌ డాలర్‌ లేక్‌’ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత గుండ్రంగా ఉన్న సరస్సు ఇదేనని భావిస్తున్నారు. ఆ సరస్సు విశేషాల గురించి తెలుసుకోండి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. గుడిలోకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి మృతి

కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున తొండంగి మండలం ఎ.కొత్తపల్లి వద్ద గ్రావెల్‌ లారీ బీభత్సం సృష్టించింది. అన్నవరం నుంచి ఒంటిమామిడి వైపునకు వెళ్తున్న లారీ.. ఎ.కొత్తపల్లిలో రోడ్డు పక్కనే ఉన్న తాగునీటి ట్యాంకును ఢీ కొట్టిట్టి పక్కనే ఉన్న వినాయకుడి గుడిపైకి దూసుకెళ్లింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు