Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 01 Apr 2023 17:04 IST

1. నా రాజకీయ జీవితమంతా పోరాటాలే: సీఎం కేసీఆర్‌

ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటు పోట్లు చూశానని భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. తన రాజకీయ జీవితమంతా పోరాటాలే అని తెలిపారు. చిత్తశుద్ధితో పనిచేస్తే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో మహారాష్ట్ర రైతు సంఘాల నేతలతో శనివారం కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ సమక్షంలో మహారాష్ట్ర రైతు నేత శరద్‌జోషి, ప్రణీత్‌, తదితరులు భారాసలో చేరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రూ.లక్షల కోట్ల ప్రజాధనం తీసుకొచ్చి అమరావతి గోతుల్లో పోయాలా?: మంత్రి బొత్స

మూడు రాజధానులే వైకాపా ప్రభుత్వ విధానమని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి పునరుద్ఘాటించారు. రూ.లక్షల కోట్ల ప్రజాధనం తీసుకొచ్చి అమరావతి గోతుల్లో పోయాలా? అని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని పేరుతో ఆర్థికంగా లబ్ధిపొందినవారే తప్ప నిజమైన రైతులెవరూ ఉద్యమంలో లేరని ఆరోపించారు. రైతులు టెంటు వేసుకుని కూర్చోవడం ఉద్యమ స్ఫూర్తా? అని బొత్స ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కాంగ్రెస్‌ ర్యాలీ వాయిదా..ఒకేరోజు మోదీ, రాహుల్‌ మీటింగ్స్‌

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ పార్టీల ప్రచార జోరు మరింత వేడెక్కింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒకే రోజు.. అటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఇటు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఏప్రిల్‌ 9న వీరిద్దరూ కర్ణాటకలో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ధోనీ 15 ఏళ్ల కిందట ఉన్నంత దూకుడుగా ఉండలేడు కదా: సీఎస్‌కే కోచ్

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (IPL 2023) 16వ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ  (MS Dhoni) అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 41 ఏళ్ల 267 రోజుల వయసులో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. గతంలో షేన్‌ వార్న్ 41 ఏళ్ల 249 రోజుల వయసులో  రాజస్థాన్‌ సారథిగా వ్యవహరించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘దిల్లీకి వస్తే.. ఏకే-47తో కాల్చేస్తామన్నారు..’: సంజయ్‌ రౌత్‌

శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut )కు గ్యాంగ్‌స్టర్ల నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయన ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి తనకు ఈ బెదింపులు వచ్చాయని ఆయన ఆరోపించారు. పంజాబ్‌ గాయకుడు సిద్ధూ మూసేవాలా మాదిరిగానే తననూ చంపేస్తామని (death threat) వారు హెచ్చరించారని రౌత్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. గగనతలంలో ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన.. ఇండిగో విమానంలో ఘటన

గగనతలంలో ఓ ప్రయాణికుడు విచక్షణ కోల్పోయాడు. ఎయిర్‌హోస్టెస్‌( IndiGo air hostess)తో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు తోటి ప్రయాణికులపై దాడి చేశాడు. బ్యాంకాక్‌ నుంచి ముంబయికి వస్తోన్న ఇండిగో(Indigo) విమానంలో ఈ ఘటన జరిగింది. విమానంలో ఆహారం అందుబాటులో లేదని ఎయిర్‌హోస్టెస్ చెప్పగా.. సదరు ప్రయాణికుడు అనుచితంగా ప్రవర్తించడం ప్రారంభించాడని సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భార్య కోసమే కొత్త బడ్జెట్‌ పాలసీ.. రిషి సునాక్‌పై విమర్శలు

బ్రిటన్‌ (Britain) ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రిషి సునాక్‌ను విమర్శలు, వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఆయన మరోసారి వివాదాస్పద వార్తల్లో నిలిచారు. ఇటీవల రిషి సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఓ కొత్త పాలసీపై విపక్షాలు మండిపడుతున్నాయి. తన భార్య అక్షతా మూర్తి వ్యాపార ప్రయోజనాల కోసమే ఆ నూతన విధానాన్ని తీసుకొచ్చారంటూ రిషిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చిన్న మొత్తాల పొదుపు పథకాలకు.. ఆధార్‌, పాన్‌ తప్పనిసరి 

కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చేసింది. ఈరోజు (ఏప్రిల్‌1) నుంచి కేంద్రం తెచ్చిన కొత్త నిర్ణయాలు అమలు కానున్నాయి. ఇప్పటికే ఆధార్ పాన్ అనుసంధాన గడువును పెంచిన కేంద్రం మరో కొత్త నిబంధనను తీసుకొచ్చింది. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఇకపై పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలకు పాన్‌, ఆధార్‌ కార్డ్‌ను తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మార్చిలో ఓలా అమ్మకాల జోరు

'ఓలా ఎలక్ట్రిక్‌' 2023 మార్చిలో 27,000 కంటే ఎక్కువ యూనిట్లను విక్రయించి, తన మార్కెట్‌ వాటాను 30%కు విస్తరించింది. 'ఓలా ఎలక్ట్రిక్‌' తన కొత్త S1 ఎయిర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ప్రారంభ ధర రూ.79,999గా నిర్ణయించింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో భారీ విస్తరణ కోసం సమృద్ధిగా నిధులను వెచ్చించాలని కంపెనీ యోచిస్తోంది. ఇలాంటివి మరో 50కు పెంచాలని సంస్థ ఆలోచన. తమ వినియోగదారులలో 90% మంది ఈ కేంద్రాలకు 20 కి.మీ పరిధిలో నివశిస్తున్నారని కంపెనీ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అసలే త్రిపుల్‌ రైడింగ్‌... ఒక్కరికి హెల్మెట్లు లేవు..పైగా వన్‌ వీల్‌తో విన్యాసాలు..

నగరంలో రోజూ ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో రోడ్డు ప్రమాదాలు జరగుతున్నా ఆకతాయి యువత మాత్రం వికృత చేష్టలు మానుకోవట్లేదు. శ్రుతి మించిన వేగంతో వాహనాలు నడుపుతున్నారు. ప్రాణాలను లెక్కచేయకుండా బైకులపై ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా ముంబయి(Mumbai)లో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని