Ola Electric: మార్చిలో ఓలా అమ్మకాల జోరు

ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీదారైన 'ఓలా' మార్చి నెలలో తన మార్కెట్‌ వాటాను గణనీయంగా పెంచుకుంది.

Updated : 01 Apr 2023 17:35 IST

'ఓలా ఎలక్ట్రిక్‌' 2023 మార్చిలో 27,000 కంటే ఎక్కువ యూనిట్లను విక్రయించి, తన మార్కెట్‌ వాటాను 30%కు విస్తరించింది. 'ఓలా ఎలక్ట్రిక్‌' తన కొత్త S1 ఎయిర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ప్రారంభ ధర రూ.79,999గా నిర్ణయించింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో భారీ విస్తరణ కోసం సమృద్ధిగా నిధులను వెచ్చించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ప్రస్తుతం 400 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లను కలిగి ఉంది. ఇలాంటివి మరో 50కు పెంచాలని సంస్థ ఆలోచన. తమ వినియోగదారులలో 90% మంది ఈ కేంద్రాలకు 20 కి.మీ పరిధిలో నివశిస్తున్నారని కంపెనీ పేర్కొంది.

రాబోయే రెండేళ్లలో కంపెనీ మరింత విస్తరణ దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ విస్తరణకు, కార్పోరేట్‌ అవసరాలు తీర్చుకోవడానికి 300 బిలియన్‌ డాలర్లను సేకరించాలని సంస్థ ఆలోచన. ఈ నిధుల సేకరణను ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు ‘గోల్డ్‌మన్‌ శాక్స్‌’ నిర్వహిస్తోంది. గతంలో ఓలా ఎలక్ట్రిక్‌ వాహనాల భద్రతకు సంబంధించిన వివాదాలు చుట్టుముట్టినా కూడా, ప్రస్తుతం దేశీయంగా ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలలో అగ్రగామిగా ఉంది. ఇది దాదాపు బిలియన్‌ డాలర్ల వార్షిక రాబడిని  కలిగి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని