Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు...
1. ‘ఎందుకు రావట్లేదు’- కేటీఆర్... ‘పిలిస్తే కదా వచ్చేది’- ఈటల
తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ముందు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. భాజపా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, రాజాసింగ్ వద్దకు మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా వచ్చి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారి మధ్య సంభాషణ జరిగింది. హుజూరాబాద్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని ఈటలను కేటీఆర్ ప్రశ్నించినట్లు తెలిసింది. పిలిస్తే కదా హాజరయ్యేది అంటూ ఆయన సమాధానమిచ్చినట్లు సమాచారం. పూర్తి వార్త క్లిక్ చేయండి
2. అది ఫోన్ ట్యాపింగ్ కాదు.. మ్యాన్ ట్యాపింగ్: కోటంరెడ్డికి మంత్రి కాకాణి కౌంటర్
తన ఫోన్ ట్యాప్ చేశారంటూ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. ఎందుకు కేంద్రానికి ఫిర్యాదు చేయలేదని, న్యాయస్థానాలను ఎందుకు ఆశ్రయించలేదని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. అది ఫోన్ ట్యాపింగ్ కాదు.. మ్యాన్ ట్యాపింగ్ అని ఆక్షేపించారు. శ్రీధర్‌రెడ్డిని తెదేపా అధినేత చంద్రబాబు ట్యాప్ చేశారని ఆరోపించారు. పూర్తి వార్త క్లిక్ చేయండి
3. అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్.. ఆషామాషీగా జరగదు: కోటంరెడ్డి
అనుమానించిన చోట ఉండకూడదని భావించి నీతిగా, నిజాయతీగా తన అధికారాన్ని వదులుకున్నానని వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (kotamreddy) అన్నారు. ఆఖరి దాకా ఉండి నామినేషన్లకు ముందు రోజు మోసం చేస్తే తప్పని.. కానీ తాను అలా చేయలేదన్నారు. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కోటంరెడ్డి చేసిన ఆరోపణలపై వైకాపా నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పూర్తి వార్త క్లిక్ చేయండి
4. కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలా? వద్దా?.. అభిప్రాయం వెల్లడించని ఏజీ
కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటుపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలా? వద్దా? అనే దానిపై అభిప్రాయం తెలిపేందుకు అటార్నీ జనరల్ వెంకటరమణి నిరాకరించారు. కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటుపై గతంలోనే ఏజీ అభిప్రాయాన్ని కేంద్రం కోరింది. అయితే, ఏజీగా ఆయన బాధ్యతలు చేపట్టక ముందు.. సీనియర్ న్యాయవాదిగా ఏపీ ప్రభుత్వం తరఫున కొన్ని కేసుల్లో హాజరైనందున తన అభిప్రాయాన్ని చెప్పలేనని స్పష్టం చేశారు. పూర్తి వార్త క్లిక్ చేయండి
5. విశ్వనాథ్ ‘S’ సెంటిమెంట్.. ఆ రెండు చిత్రాల విషయంలో నెరవేరని కల!
కళలే ఇతివృత్తంగా సినిమాలు తీసి, టాలీవుడ్, భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అరుదైన గుర్తింపు పొందారు కె. విశ్వనాథ్ (K Viswanath). కమర్షియల్ హంగులతో రూపొందితేనే సినిమాకు విజయం వరిస్తుందని భావించిన వారిందరికీ తన కథలతో అది తప్పు అని నిరూపించారు. 50కిపైగా చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించగా ‘ఎస్’ (S) అక్షరంతో ప్రారంభమయ్యే సినిమాలు విశేష ఆదరణ దక్కించుకోవడం విశేషం. పూర్తి వార్త క్లిక్ చేయండి
6. ‘కళా తపస్వి’.. ఆ పదం వినగానే భయం వేసింది!
తెలుగు సినిమాను ఒక స్థాయిలో నిలిపారు కళాతపస్వి, ప్రముఖ దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ (K.Viswanath). ఆయన మరణంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా మూగబోయింది.(K.Viswanath is no more). ఆయన గతంలో ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమంలో తన మనసులోని పలు విషయాలను పంచుకున్నారు. పూర్తి వార్త క్లిక్ చేయండి
7. స్పిన్ ఎదుర్కోవడం కోహ్లీకి కాస్త కష్టమే.. కింగ్‌కు మాజీ ఆటగాడి సూచన ఇదే!
మరికొద్ది రోజుల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) జరగనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే నాగ్‌పుర్ చేరుకున్న టీమ్‌ఇండియా (Team India) జట్టు తొలి టెస్టు కోసం సాధన మొదలుపెట్టింది. ఈ సిరీస్‌లో క్రికెట్ అభిమానుల కళ్లన్నీ విరాట్ కోహ్లీ (Virat Kohli)పైనే. పరిమిత ఓవర్లలో తిరిగి ఫామ్‌లోకి వచ్చి రికార్డులు సృష్టిస్తున్న ఈ పరుగుల రారాజు.. టెస్టుల్లోనూ సత్తా చాటాలని అభిమానులు ఆశపడుతున్నారు. పూర్తి వార్త క్లిక్ చేయండి
8. ఆ రికార్డులు సమర్పించండి.. బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
2002లో గుజరాత్ అల్లర్లు.. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ (Modi)ని విమర్శిస్తూ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర వివాదానికి దారితీసింది. దీంతో దాని ప్రసారంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం విచారణ జరిపింది. పూర్తి వార్త క్లిక్ చేయండి
9. 80 ఏళ్ల తర్వాత.. మళ్లీ సరిహద్దుల్లో వారి ట్యాంకులు!
ఉక్రెయిన్(Ukraine)పై రష్యా(Russia) జరుపుతోన్న దురాక్రమణ మొదలై ఏడాది కావొస్తోంది. దీని ముగింపు మాటే వినిపించడంలేదు. అమెరికా, జర్మనీ దేశాలు ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు ఇవ్వాలని నిర్ణయించడంపై ఇప్పటికే రష్యా తీవ్రంగా మండిపడింది. దీనిపై తాజాగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్(Putin) స్పందించారు. 80 ఏళ్ల తర్వాత చరిత్ర పునరావృతమవుతోందని జర్మనీ ట్యాంకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పూర్తి వార్త క్లిక్ చేయండి
10. రూ.13.9వేల కోట్లు కొల్లగొట్టిన కిమ్ ‘జాతిరత్నాలు’..!
అటు ఐక్యరాజ్య సమితి ఆంక్షలు.. ఇటు ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్నా.. ఉత్తరకొరియా అధినేత కిమ్ మాత్రం అణ్వాయుధ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. మరి తినడానికే తిండి లేనప్పుడు అణు పరీక్షలకు డబ్బెలా.. అదంతా కిమ్ చెంతన ఉన్న జాతిరత్నాల్లాంటి హ్యాకర్ల పుణ్యమే మరి! బ్లాక్‌చైన్ టెక్నాలజీతో అత్యంత పకడ్బందీగా నడిపించే క్రిప్టో ఎక్స్‌ఛేంజిల్లోకి ఉత్తరకొరియా హ్యాకర్లు చొరబడి వేల కోట్లను తస్కరిస్తున్నారు. పూర్తి వార్త క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
ఉదయం ప్రజాప్రతినిధి.. మధ్యాహ్నం కూలీ
-
India News
వెనుకా ముందు యువతులు.. బైక్‌పై ఆకతాయి చేష్టలు
-
Politics News
Ganta Srinivasa Rao: ఉత్తరాంధ్ర ప్రజలు రాజధానిని కోరుకోవడం లేదు: గంటా
-
India News
వింత ఘటన.. ఉల్లి కోసేందుకు వెళితే కళ్లలోంచి కీటకాల ధార
-
Ap-top-news News
Andhra News: ఈ వృద్ధుడు.. మృత్యుంజయుడు
-
Ap-top-news News
Vande Bharat Express: సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ షెడ్యూల్ ఇదే..