Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు...

Updated : 04 Mar 2023 17:10 IST

1. సొంతగడ్డపై సేవలు అందించేందుకు వైద్యులు ముందుకురావాలి: హరీశ్‌రావు

ఉమ్మడి రాష్ట్ర పాలకులు తెలంగాణలో గాంధీ, నిమ్స్‌, ఉస్మానియా మినహా ఒక్క సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించలేదని మంత్రి హరీశ్‌రావు (Minister Harish rao) విమర్శించారు. తెలంగాణలో కొత్త ఆసుపత్రులు నిర్మిస్తూనే.. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నవాటిని బలోపేతం చేస్తుందని తెలిపారు. నిమ్స్‌ ఆసుపత్రిలో (NIMS Hospital) చిన్న పిల్లల గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు చేసిన యూకే వైద్య బృందాన్ని మంత్రి శనివారం సన్మానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీలో కొత్తగా 6 లక్షల ఉద్యోగాలు: అమర్నాథ్‌

విశాఖ వేదికగా  రెండు రోజులపాటు జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌)లో 352 ఒప్పందాలు చేసుకున్నట్లు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తెలిపారు. సదస్సు ముగిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రానికి రూ.13.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. తొలుత రూ.5 లక్షల కోట్లు వస్తాయని భావిస్తే అంతకుమించి.. రూ.13.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అంతర్జాతీయ కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయి: సుచిత్ర ఎల్ల

తక్కువ కాలంలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందని భారత్‌ బయోటెక్‌ ఎండీ సుచిత్ర ఎల్ల తెలిపారు. ప్రతిష్ఠాత్మకంగా భావించి సదస్సు నిర్వహించడం సంతోషకరమని చెప్పారు. విశాఖ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌)లో సుచిత్ర ఎల్ల మాట్లాడారు. ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం అయినందుకు సంతోషిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. విదేశీ గడ్డ మీద భారత్‌పై విమర్శలా?.. పాక్‌ కూడా ఆ సాహసం చేయలేదు: భాజపా

భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (BJP) తన విమర్శల దాడిని ఉద్ధృతం చేసింది. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడింది. పొరుగు దేశం పాక్‌ సైతం ఎప్పుడూ ఆ సాహసం చేయలేదని పేర్కొంది. భారత్‌ గురించి ప్రపంచమంతా గొప్పగా చెప్పుకుంటూ ఉంటే.. విదేశీ గడ్డపై ప్రతిపక్ష నేత ఇలా మాట్లాడాతారా అంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. దీనికెందుకు డీఆర్‌ఎస్‌..? ఇదో చెత్త నిర్ణయం.. బంగ్లా కెప్టెన్‌పై ఫ్యాన్స్‌ ఫైర్

క్రికెట్‌ మ్యాచ్‌లో డీఆర్‌ఎస్‌లకు (DRS) ఉన్న విలువ ప్రతి క్రికెటర్‌కూ తెలుసు. అంపైర్‌ నుంచి తమకు అనుకూలంగా ఫలితం రానప్పుడు వెంటనే సమీక్షను కోరుతుంటారు. కాస్త అనుమానం ఉన్నప్పుడు మాత్రమే ఇలా డీఆర్‌ఎస్‌ను తీసుకుంటూ ఉంటారు. అది పక్కాగా నాటౌట్‌ అని తెలిసినా ఫీల్డింగ్‌ జట్టు డీఆర్‌ఎస్‌ను తీసుకుంటే మాత్రం.. కీలకమైన బ్యాటర్‌ గురించి అనుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మోదీతో మాట్లాడాక.. మరింత ఆశతో ఉన్నా: బిల్‌గేట్స్‌

టెక్‌ దిగ్గజం, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ (Bill Gates) భారత్‌పై మరోసారి ప్రశంసలు కురిపించారు. అన్ని రంగాల్లో దేశం పురోగతి చెందుతోందని, సృజనాత్మకత రంగంలో పెట్టుబడులు పెడితే ఎలాంటి అద్భుతాలు సాధించగలమో చెప్పేందుకు ఈ దేశమే నిదర్శనమని కొనియాడారు. దిల్లీ పర్యటనలో ఉన్న బిల్‌ గేట్స్‌.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో శుక్రవారం సమావేశమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సిసోదియాకు లభించని ఊరట.. కస్టడీ పొడగింపు

మద్యం కుంభకోణం (excise scam) కేసులో అరెస్టయిన దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోదియా (Manish Sisodia)కు దిల్లీ (Delhi) కోర్టులో ఊరట లభించలేదు. ఆయనకు విధించిన కస్టడీని కోర్టు మరో రెండు రోజులు పొడగించింది..  మరోవైపు బెయిల్‌ కోసం ఆయన చేసిన పిటిషన్‌పై విచారణను బెయిల్‌ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం 10వ తేదీకి వాయిదా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చైనాతో జాగ్రత్త.. అది అత్యంత క్రమశిక్షణ కలిగిన శత్రువు..!

అమెరికా(America) ఇప్పటివరకు ఎదుర్కొన్న దేశాలతో పోలిస్తే.. చైనా(China) అత్యంత బలమైన, క్రమశిక్షణ కలిగిన శత్రువు అని అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న నిక్కీ హేలీ(Nikki Haley) వ్యాఖ్యానించారు. రిపబ్లికన్ పార్టీ కార్యక్రమంలో చైనాను ఉద్దేశించి ఈ హెచ్చరికలు చేశారు. ‘అమెరికా ఎదుర్కొన్న దేశాలతో పోలిస్తే.. చైనా(China) అత్యంత క్రమశిక్షణ కలిగిన శత్రువు. అలాగే బలమైనది’ అని హేలీ(Nikki Haley) అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మరి గబ్బా పిచ్‌కు ఎన్ని డీమెరిట్‌ పాయింట్లు ఇచ్చారు..? ఐసీసీపై మండిపడ్డ గావస్కర్‌

స్పిన్‌కు విపరీతంగా సహకరించి బ్యాటింగ్‌ చాలా కష్టంగా మారిన ఇందౌర్‌ పిచ్‌(Indore Pitch)ను ఐసీసీ(ICC) ‘పేలవమైంది’గా పేర్కొనడంపై మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar) మండిపడ్డాడు. మ్యాచ్‌ రిఫరీ నివేదిక ఆధారంగా ఈ పిచ్‌ పేలవం(poor)గా ఉన్నట్లు ఐసీసీ పేర్కొంది. ఈ మైదానానికి మూడు డీమెరిట్‌ పాయింట్లు(demerit points) కేటాయించింది. అయితే ఈ అంశంపై గావస్కర్‌ స్పందించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. దగ్గు కేసులు.. యాంటీబయాటిక్స్‌ వాడకంపై హెచ్చరిక!

కొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా నిరంతర దగ్గు(Persistent Cough) కేసులు, కొన్ని సందర్భాల్లో జ్వరంతోకూడిన దగ్గు కేసులు నమోదవుతున్నాయి. అయితే, వీటిలో చాలా కేసులకు ‘ఇన్‌ఫ్లుయెంజా ఏ’ ఉప రకం ‘హెచ్3ఎన్2(H3N2)’ వైరస్‌ కారణమవుతోందని భారత వైద్య పరిశోధన మండలి(ICMR) నిపుణులు వెల్లడించారు. గత రెండు, మూడు నెలలుగా ఇది విస్తృతంగా వ్యాప్తిలో ఉందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు