Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

టాప్‌ 10 న్యూస్‌: ఈనాడు. నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 30 Sep 2022 17:16 IST

1. హరీశ్‌రావు, కేసీఆర్‌కు మధ్య గొడవలుంటే వాళ్లు చూసుకోవాలి: మంత్రి అమర్నాథ్‌

మంత్రి హరీశ్‌రావు, సీఎం కేసీఆర్‌కు మధ్య గొడవలు ఉంటే వాళ్లు వాళ్లు చూసుకోవాలి కానీ ఆంధ్రప్రదేశ్‌పై విమర్శలు చేయడం సరికాదని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మండిపడ్డారు. తెలంగాణ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి.. తెలంగాణకు ఎనిమిదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్‌ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. కేసీఆర్ యాదగిరిగుట్ట పర్యటన.. పనుల పురోగతిపై సీఎం సమీక్ష

తెలంగాణ సీఎం కేసీఆర్‌ యాదగిరిగుట్ట పర్యటన కొనసాగుతోంది. ఆలయంలో జరుగుతున్న వివిధ పనుల పురోగతిపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. పెండింగ్‌ పనులు, ఇతర అంశాలపై ఆయన ఆరా తీస్తున్నట్లు సమాచారం. మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో యాదగిరిగుట్టలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలు, సమీప ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. పీఎఫ్‌ఐ.. వైకాపా రెండూ ఒకటే: భాజపా నేత సత్యకుమార్‌

వైకాపాపై భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ పార్టీని నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ)తో పోల్చారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో సత్యకుమార్‌ మాట్లాడారు. పీఎఫ్‌ఐకు వైకాపాకు పెద్ద తేడాలేదని వ్యాఖ్యానించారు. ఆ సంస్థలాగే వైకాపావి కూడా విధ్వంసకర ఆలోచనలేనని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. థరూర్‌ Vs ఖర్గే.. నామినేషన్లు వేసిన నేతలు

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ల పర్వం మొదలైంది. దీంతో ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద సందడి నెలకొంది. ఈ పదవికి పోటీ చేస్తానని అందరికంటే ముందే ప్రకటించిన తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ మధ్యాహ్నం డప్పు వాయిద్యాలు, అభిమాన కార్యకర్తల గణంతో థరూర్‌ ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీకి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. నేనెలాంటి ఎన్నికల్లో పోటీ చేయటం లేదు: అక్కినేని నాగార్జున

రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. ఆయన కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రం ‘ది ఘోస్ట్‌’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. తాను విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానన్న ప్రచారంలో నిజం లేదన్నారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


రివ్యూ: పొన్నియిన్ సెల్వన్‌-1


6. టీ20 ప్రపంచకప్‌ విజేతకు దక్కే ప్రైజ్‌మనీ ఎంతంటే?

ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్‌ ప్రైజ్‌మనీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. గతేడాది ప్రైజ్‌మనీకి.. ఈసారి విజేతలకు దక్కే ప్రైజ్‌మనీకి తేడా లేదు. దాదాపు నెల రోజులపాటు జరిగే మెగా టోర్నీలో  విజేతగా నిలిచే జట్టుకు 1.6 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.13 కోట్లు) అందనుంది. అలాగే రన్నరప్‌నకు 0.8 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.6.5 కోట్లు) దక్కనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ఆర్‌బీఐ అరశాతం పెంపుతో నిద్రలేచిన బుల్‌.. దూసుకెళ్లిన సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో ఎట్టకేలకు ఏడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది. ఆర్‌బీఐ రెపోరేటు పెంపు అంచనాలకు అనుగుణంగానే ఉండడంతో బుల్‌ రంగంలోకి దిగింది. రెపోరేటును 0.50 శాతం మాత్రమే పెంచుతున్నట్లు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించిన వెంటనే మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 100, నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 సూచీలు 1 శాతానికి పైగా ఎగబాకాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. ప్రధాని చేతుల మీదుగా రేపు 5జీ సేవలు ప్రారంభం

దేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే సమయం ఆసన్నమైంది. శనివారం (అక్టోబర్‌ 1) ప్రధాని నరేంద్రమోదీ చేతులు మీదుగా ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. ఎంపిక చేసిన నగరాల్లో తొలుత ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దశలవారీగా దేశవ్యాప్తంగా ఈ సేవలు విస్తరించనున్నాయి. దిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నిర్వహించే ఆరో విడత ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌, 2022 సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఉదయం 10 గంటలకు 5జీ సేవలను ప్రారంభిస్తారని అధికారిక ప్రకటన వెలువడింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. రెండు రోజుల్లో 15 వజ్రాలు దొరికాయ్‌.. వేలం వేస్తే ఎంత ధర పలుకుతాయో తెలుసా?

మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ ప్రాంతం పన్నాలో వజ్రాల(Diamonds) పంట పండింది. అక్కడి వేర్వేరు గనుల్లో పెద్ద సంఖ్యలో బయటపడిన వజ్రాలు పలువురిని అదృష్టవంతుల్ని చేశాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే అక్కడి కూలీలు/స్థానికులకు 15 వజ్రాలు దొరికినట్టు గనుల శాఖ అధికారులు వెల్లడించారు. వీటి మొత్తం బరువు 35.86 క్యారెట్లు ఉంటుందని.. వేలంలో ధర రూ.కోటి దాకా పలకవచ్చని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతుండగా.. ఆత్మాహుతి దాడి..!

రాజకీయంగా అస్థిరత్వంతో కొట్టుమిట్టాడుతోన్న అఫ్గానిస్థాన్‌ వరుస పేలుళ్లతో దద్దరిల్లుతోంది. శుక్రవారం ఉదయం రాజధాని నగరం కాబుల్‌లోని ఓ విద్యాకేంద్రంలో ఆత్మాహుతి దాడి జరిగింది. విద్యార్థులు ఒకవైపు పరీక్షలకు సిద్ధం అవుతుండగా ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 19 మంది మరణించారని పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని