Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 07 Mar 2024 17:10 IST

1. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంతో భేషజాలకు వెళ్లం: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్సేనని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోవడం వల్లే నగరం అభివృద్ధి చెందిందని చెప్పారు. హైదరాబాద్‌-రామగుండం రాజీవ్‌ రహదారిలో పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి తూముకుంట వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి అల్వాల్‌ సమీపంలో సీఎం శంకుస్థాపన చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సీఎం రేవంత్‌రెడ్డి పక్కనే మానవ బాంబులు: కేటీఆర్‌

కరీంనగర్‌ అంటే భారాస అధినేత కేసీఆర్‌కు సెంటిమెంటని.. ఇక్కడి నుంచే ఎన్నో పోరాటాలకు శ్రీకారం చుట్టారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. ఆనాడు ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా ఇక్కడి నుంచే జంగ్‌ సైరన్ మోగించారని గుర్తు చేశారు. ఇప్పుడు అబద్ధాల సీఎం రేవంత్‌రెడ్డి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెలంగాణలో 15 నుంచి ఒంటిపూట బడులు

వేసవి తీవ్రత పెరుగుతున్నందున ఈ నెల 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 23 వరకు (విద్యా సంవత్సరం ముగిసే వరకు) రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒంటి పూట బడులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల

తెలంగాణలో త్వరలో జరగబోయే పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల అయ్యాయి. ఈ నెల 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మరోసారి వైకాపా వస్తే రాయలసీమలో ఇంకేమీ మిగలదు: పవన్‌

రాయలసీమ ప్రాంతం కొందరి కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గురువారం పవన్‌ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రెండు నెలలు ఓపిక పట్టండి.. దొంగ కేసులు ఎత్తివేస్తాం: నారా లోకేశ్

వైకాపా పాలనలో రాష్ట్రంలో 300 మంది బీసీలను హత్య చేశారని తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) ఆరోపించారు. హిందూపురంలో నిర్వహించిన ‘తెదేపా శంఖారావం’ సభలో ఆయన మాట్లాడారు. 26వేల మంది బీసీలపై అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. రెండు నెలలు ఓపిక పట్టాలని.. ఆ దొంగ కేసులు ఎత్తివేస్తామన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘హోదా’పై మాట్లాడుతూ షర్మిల భావోద్వేగం

వ్యక్తిగత కారణాల వల్ల తాను ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) అన్నారు. అలా అనుకుంటే 2019లోనే ఇక్కడ అడుగు పెట్టేదాన్ని అని వ్యాఖ్యానించారు. మంగళగిరిలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పోరాడకపోతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘ఆర్టికల్‌ 370’పై కాంగ్రెస్‌ తప్పుదోవ పట్టిస్తోంది: ప్రధాని మోదీ

ఆర్టికల్‌ 370 (Article 370) రద్దు అనంతరం జమ్మూ-కశ్మీర్‌ (Jammu Kashmir) స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. తద్వారా అభివృద్ధిలో ఈ ప్రాంతం సరికొత్త శిఖరాలను తాకుతోందని చెప్పారు. ‘ఆర్టికల్‌ 370’ రద్దు అనంతరం తొలిసారి కశ్మీర్‌ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. బక్షీ స్టేడియంలో నిర్వహించిన సభలో ప్రసంగించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కార్గో నౌకపై హూతీల క్షిపణి దాడి.. భారత నేవీ డేరింగ్‌ రెస్క్యూ

సరకు రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకొని హూతీ (Houthi) తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు. గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌ (gulf of aden)లో ‘ట్రూ కాన్ఫిడెన్స్‌’ కార్గో నౌక (Cargo ship)పై క్షిపణులతో దాడి (Missile Attack) చేశారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న సిబ్బందిని భారత యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా (INS Kolkata) కాపాడింది. క్లిష్ట పరిస్థితుల్లో అత్యంత సాహసోపేతంగా వారిని రక్షించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అమెరికా అధీనంలో రష్యా ‘తెల్ల ఏనుగు’.. వృథాగా 20 మిలియన్‌ డాలర్ల ఖర్చు

రష్యా సంపన్నుడిని శిక్షించాలనే లక్ష్యంతో అమెరికా (USA) తీసుకొన్న ఓ నిర్ణయం బెడిసికొడుతోంది. నెలకు దాదాపు మిలియన్‌ డాలర్లు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టిన సమయంలో క్రెమ్లిన్‌తో సన్నిహిత సంబంధాలున్న సంపన్నుడు సులేమాన్‌ కెరిమోవ్‌కు చెందిన విలాసవంతమైన నౌకను అమెరికా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు సీజ్‌ చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు