Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 04 Dec 2022 20:59 IST

1. ఉత్కంఠ పోరులో టీమ్‌ఇండియాపై బంగ్లాదేశ్ విజయం

టీమ్‌ఇండియాతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించిది. బంగ్లా బ్యాటర్లలో  లిటాన్‌ దాస్‌ (41) రాణించగా.. చివర్లో మెహిదీ హసన్‌ (38; 39 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి బంగ్లాకు విజయాన్ని అందించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. cm kcr: మోదీ సర్కారు వల్ల తెలంగాణకు రూ.3లక్షల కోట్ల నష్టం: సీఎం కేసీఆర్‌

ప్రశ్నించిన ప్రభుత్వాన్ని పడగొట్టడమే మోదీ విధానమా? అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిద్దామని పాలమూరు ప్రజలకు పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్‌ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించుకున్నామని, అదే స్ఫూర్తితో జాతీయ రాజకీయాల్లో ముందుకెళ్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. khakee the bihar chapter: టాప్‌ ట్రెండింగ్‌లో ‘ఖాకీ: ది బిహార్‌ చాప్టర్‌’ వెబ్‌సిరీస్‌

ఐపీఎస్‌ అధికారి అమిత్‌ లోధా కెరీర్‌లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొనేలా చేసిన సంఘటన గ్యాంగ్‌స్టర్‌ అశోక్‌ మహతోను పట్టుకోవడం. అత్యంత సాహోసేపతమైన ఆపరేషన్‌ను ‘ఖాకీ: ది బిహార్‌ చాప్టర్‌’ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌సిరీస్‌గా తెరకెక్కించింది. గతవారం స్ట్రీమింగ్‌ మొదలైన ఈ వెబ్‌సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ గ్లోబల్‌ ట్రెండింగ్‌లో టాప్‌-10లోకి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Navy Day: సాగర తీరంలో సాహస విన్యాసాలు.. అట్టహాసంగా నేవీ డే

నౌకాదళ దినోత్సవం (Navy Day) సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్‌లో నౌకాదళ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వేళ నిర్వహిస్తున్న ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై విన్యాసాలు తిలకించారు. ఐఎన్‌ఎస్‌ సింధు వీర్‌ జలాంతర్గామి ద్వారా రాష్ట్రపతికి త్రివర్ణ బాంబర్లతో నౌకాదళం ఘన స్వాగతం పలికింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. FIFA: అబూబాకర్‌ను ఎందుకు పంపేశారు? రూల్స్‌ ఏం చెబుతున్నాయ్‌?

ఫిఫా (FIFA) ప్రపంచకప్‌ గ్రూప్‌ దశ చివరి మ్యాచ్‌లో అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్‌కు కామెరూన్‌ షాకిచ్చింది. మ్యాచ్‌ను 0-1తేడాతో కైవసం చేసుకుంది. 1998 తర్వాత గ్రూప్ దశలో అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న బ్రెజిల్‌ వేగానికి బ్రేక్‌ వేసింది. మ్యాచ్‌ చివర్లో అద్భుతమైన గోల్‌ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చిన కామెరూన్‌ కెప్టెన్‌ అబూబాకర్‌(Aboubakar)ను రిఫరీ గ్రౌండ్‌ నుంచి బయటకు పంపేశాడు. ఎందుకో తెలుసా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Keerthy Suresh: ‘కేజీయఫ్‌’ నిర్మాణ సంస్థతో కీర్తి సురేశ్‌.. తిరుగుబాటు దేనికోసం?

‘కేజీయఫ్‌’ పార్ట్‌ 1, 2 సినిమాలతో విశేష గుర్తింపు పొందిన సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ (Hombale Films). ఇప్పుడీ నిర్మాణ సంస్థ ఓ నాయికా ప్రాధాన్య చిత్రానికి శ్రీకారం చుట్టింది. దాని కోసం ప్రముఖ నటి కీర్తి సురేశ్‌ (Keerthy Suresh)ను ఎంపిక చేసినట్టు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది. టైటిల్‌ను ఖరారు చేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. IND vs BAN: బంగ్లాతో వన్డేకు పంత్‌ దూరం.. కారణం ఇదే: బీసీసీఐ

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఆదివారం ప్రకటించింది.  పంత్‌ స్థానంలో మరే ఇతర ఆటగాడిని తీసుకోలేదంటూ తెలిపింది. ఈ సిరీస్‌ అనంతరం టెస్టు సిరీస్‌లో అతడు తిరిగి పాల్గొంటాడని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Twin sisters marriage: ఒకే వ్యక్తిని పెళ్లాడిన కవల అక్కాచెల్లెళ్లు.. వరుడిపై కేసు నమోదు!

మహారాష్ట్రలోని సోలాపూర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. కవలలైన అక్కాచెల్లెళ్లు ఒకే కల్యాణ వేదికపై ఒకే వ్యక్తిని పెళ్లాడిన((twin sisters wedding) ఘటన చర్చనీయాంశంగా మారింది. వీరి పెళ్లి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో వరుడిపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి     

9. FPI: నవంబరులో భారత ఈక్విటీల్లోకి రూ.36,329 కోట్ల విదేశీ పెట్టుబడులు

వరుసగా రెండు నెలల పాటు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్న విదేశీ మదుపర్లు నవంబరులో నికర కొనుగోలుదారులుగా నిలిచారు. డాలర్‌ ఇండెక్స్‌ దిగిరావడం సహా స్థూల ఆర్థిక అంశాలు మెరుగుపడడం అందుకు దోహదం చేసింది. ఈ ఏడాది మొత్తం మూడు నెలలు.. జులై, ఆగస్టు, నవంబరులో మాత్రమే విదేశీ మదుపర్లు భారత్‌లోకి పెట్టుబడులను చొప్పించారు. మిగిలిన నెలల్లో భారీ ఎత్తున ఉపసంహరించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. Telangana News: అక్రమాలకు అడ్డాగా ప్రగతి భవన్‌: ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌

ప్రగతి భవన్‌ అక్రమాలకు అడ్డాగా మారిందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీబీఐ, ఈడీ, ఏసీబీ నోటీసులు అందుకున్న వారు, తప్పు చేసిన వారు, టెండర్లు కావాలనుకునే వారు, అక్రమాలు చేయాలనుకునేవారు, టర్మినేట్‌ అయిన అధికారులు, భూ దందాలు, ల్యాండ్‌, శాండ్‌ మాఫియాకి ప్రగతిభవన్‌ కేంద్రంగా మారిందని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని