Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 29 Mar 2023 10:09 IST

1. ఐఓఎస్‌ అప్‌డేట్‌ చేసుకున్నారా?

సరికొత్త ఫీచర్లతో యాపిల్‌ సంస్థ ఐఓఎస్‌ 16.4 అప్‌డేట్‌ను విడుదల చేసింది. సాధారణంగా ఐఓఎస్‌ అప్‌డేట్లు సెక్యూరిటీ లోపాలను పూరించటానికి, సెటింగ్స్‌ను స్వల్పంగా మార్చటానికి తోడ్పడుతుంటాయి. ఇదే సమయంలో కొత్త ఎమోజీలనూ అందిస్తుంటాయి. వినియోగదార్లకు ఇష్టమైన ఫీచర్ల పనితీరును మరింత మెరుగు పరుస్తుంటాయి. అందుకే కొత్త అప్‌డేట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవటానికి ఆసక్తి చూపుతుంటాయి. ఈసారి అప్‌డేట్‌తో ఎలాంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయో చూద్దాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మిమ్మల్ని కిడ్నాప్‌ చేస్తా!.. వైకాపా ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

వైకాపాకు చెందిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా మంగళవారం గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో పర్యటించారు. కాన్పుల వార్డును పరిశీలించారు. అక్కడ ఓ మహిళా అధికారిని ఉద్దేశించి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘రోగుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. మిమ్మల్ని కిడ్నాప్‌ చేస్తా’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఉద్యోగుల్ని నొప్పించాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఆచార్య ప్రభావతి సమక్షంలోనే ఇదంతా జరిగింది. ఎమ్మెల్యే ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లగానే ఉద్యోగులు విధుల బహిష్కరణకు సమాయత్తమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ధోని దగ్గరచాలా నేర్చుకున్నా

అంబటి తిరుపతి రాయుడు.. పరిచయం అక్కర్లేని తెలుగు క్రికెటర్‌. భారత అండర్‌-19 ప్రపంచకప్‌ కెప్టెన్‌గా.. హైదరాబాద్‌, ఆంధ్ర, బరోడా రంజీ ట్రోఫీ జట్లకు సారథిగా టీమ్‌ఇండియా ఆటగాడిగా సుపరిచితుడు. 2010 నుంచి ఐపీఎల్‌ ఆడుతున్న ఈ ప్రతిభావంత క్రికెటర్‌ మొదట ముంబయి ఇండియన్స్‌ (2013, 2015, 2017).. అనంతరం చెన్నై సూపర్‌ కింగ్స్‌ (2018, 2021) తరఫున అయిదు సార్లు ట్రోఫీ అందుకున్నాడు. ఈ లీగ్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకడైన రాయుడుతో ముఖాముఖి ‘ఈనాడు’కు ప్రత్యేకం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక

 ఆకతాయితనంతో రైళ్లపై రాళ్లు విసరడం వంటివి చేస్తే అయిదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని దక్షిణ మధ్య రైల్వే హెచ్చరించింది. ప్రయాణికులకు, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించే చర్యలకు ఎవరూ పాల్పడవద్దని స్పష్టం చేసింది. ఇటీవల వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు రైళ్లపై రాళ్ల దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీసుకున్న చర్యలపై మంగళవారం ద.మ.రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. భువనగిరి, కాజీపేట, ఖమ్మం, ఏలూరు, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో జనవరి నుంచి ఇప్పటివరకు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సీఎం జగన్‌ కోసం 2 గంటలు వాహనాల మళ్లింపు

సీఎం జగన్‌ విశాఖ పర్యటన విజయవాడ నగరవాసులను మంగళవారం సాయంత్రం అష్టకష్టాలపాలు చేసింది. తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లాల్సిన ఆయన గంటన్నర ఆలస్యంగా బయలుదేరడంతో దాని ప్రభావం ట్రాఫిక్‌పై పడింది. సాయంత్రం ఎప్పుడూ రద్దీగా ఉండే విజయవాడ ప్రధాన వీధులు మరింత కిక్కిరిసిపోయాయి. ముఖ్యమంత్రి వచ్చేస్తున్నారంటూ 3.30గంటల నుంచే ట్రాఫిక్‌ను నియంత్రించారు. షెడ్యూల్‌ ప్రకారం తాడేపల్లిలోని నివాసం నుంచి సాయంత్రం నాలుగింటికి జగన్‌ బయలుదేరాల్సి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 33 ప్రశ్నలకు వంద మార్కులు

పదోతరగతి పరీక్షల్లో ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆరు పేపర్ల విధానం ఇప్పుడు విద్యార్థులకు కత్తి మీద సాములా మారింది. ఒకేసారి కొండంత సిలబస్‌ చదివి పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది ఏడు పేపర్ల విధానంలో పరీక్ష నిర్వహించగా, ప్రస్తుతం తొలిసారి ఆరు పేపర్లతో నిర్వహిస్తున్నారు. ఏప్రిల్‌ 3నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. బిట్‌ పేపర్‌ లేకుండానే ప్రశ్నాపత్రం ఉంటుంది. గత విద్యాసంవత్సరం ఎక్కువ మంది పదో తరగతి పరీక్ష తప్పడానికి పేపర్ల సంఖ్య తగ్గడమూ ఒక కారణమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వెంకన్న కొండనూ వదల్లేదు!

పెదకూరపాడు నియోజకవర్గంలో మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. ఎక్కడ మట్టి ఉంటే అక్కడ ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి అండతో అనుచరులు నిన్నటి వరకు కృష్ణమ్మ నదీ గర్భంలో తవ్వకాలు జరిపి ఇసుక రీచ్‌లకు బాటలు వేయగా.. ఇప్పుడు కలియుగ వైకుంఠవాసుడు స్వయంభూగా కొలువై భక్తులచే పూజలందుకుంటున్న వైకుంఠపురంలోని వెంకన్న కొండనూ కొల్లగొడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. డబ్బులిస్తారా! కోర్టు మెట్లెక్కించమంటారా!!

‘కారుకు రూ.ఏడు వేలు, పందెం పుంజుకు రూ.40 వేలు ఇవ్వండి. డబ్బులిస్తేనే వాటిని వదిలిపెడతాం.. లేదంటే కేసు కట్టి న్యాయస్థానంలో ప్రవేశపెడతాం. ఆ తర్వాత కార్లు తీసుకోవటం అంత సులభం కాదు. రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలు విలువజేసే కోళ్లను కోర్టులో పెడితే మీకే నష్టం. అందుకే మేం అడిగినంతా ఇచ్చి తీసుకెళ్తారో.. లేదంటే న్యాయస్థానంలో ప్రవేశపెట్టమంటారో.. మీరే తేల్చుకోండి’ అంటూ జూదరులకు ఓ పోలీసు అధికారి హుకుం జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నా నంబరు రాసుకోండి.. లంచమడిగితే చెప్పండి

 ‘నా ఫోన్‌ నంబరు 98497 77799 రాసుకోండి... నియోజకవర్గంలో ఎక్కడ అవినీతి జరిగినా నాకు సమాచారం ఇవ్వండి... 24గంటలూ ఫోన్లో అందుబాటులో ఉంటాను... అవినీతి చేసిన వారి భరతం పడతాను’ అని ఎలమంచిలి ఎమ్మెల్యే యూవీ.రమణమూర్తి రాజు (కన్నబాబు) డ్వాక్రా మహిళలకు హామీ ఇచ్చారు. అచ్యుతాపురం, మునగపాక, రాంబిల్లి మండలాల్లో  డ్వాక్రా మహిళలకు ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం ఎమ్మెల్యే పాల్గొన్నారు. అచ్యుతాపురంలో డ్వాక్రా మహిళలకు రూ.11.31కోట్ల విలువైన చెక్కులను ఆయన అందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వీడని పీఠముడి

 వైకాపాలో అంతర్గత రాజకీయం అట్టుడుకుతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ పట్టుబడుతున్నారు. పురపాలక ఛైర్‌పర్సన్‌ ఆదిలక్ష్మి మాత్రం మెట్టు దిగడం లేదు. ఎమ్మెల్యే మాట నెగ్గుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో చర్చనీయాంశమైంది. 28 వార్డులున్న నర్సీపట్నం పురపాలక సంఘంలో రెండేళ్ల కిందట ఎన్నికలు జరిగినప్పుడు వైకాపా 14 వార్డులను, తెదేపా 12 వార్డులను గెలుచుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థి ఒకరు, జనసేన నుంచి ఒకరు గెలిచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని