Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 22 Nov 2022 09:07 IST

1. సన్న బియ్యం అంటే ఇవేనా?

 ‘మీరు అధికారంలోకి వస్తే సన్న బియ్యం, నాణ్యమైన బియ్యం ఇస్తామన్నారు. ఇవేనా సన్న బియ్యం?’ అని రేషన్‌ బియ్యాన్ని చూపిస్తూ విజయవాడలో ఓ వృద్ధురాలు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కార్పొరేటర్‌ షాహినా సుల్తానాలను నిలదీశారు. దీంతో ‘సన్నబియ్యం ఇస్తామని ఎప్పుడు చెప్పాం? నాణ్యమైన బియ్యం ఇస్తామని చెప్పాం’ అంటూ వారు వెళ్లిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు

నగరంలోని పలు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీశాఖ దాడులు చేపట్టింది. తెల్లవారుజాము నుంచే అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి.. ఆయన కుమారుడు, అల్లుడుకు సంబంధించిన ఇళ్లు, సంస్థల్లో సోదాలు చేస్తున్నారు. కొంపల్లిలోని పాం మెడోస్‌ విల్లాలోనూ సోదాలు చేపట్టారు. దాదాపు 50 బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పటేల్‌ ఓటు.. ఈసారి ఎటు?

గుజరాత్‌లో ఎన్నికలంటే చాలు అందరి దృష్టినీ ఆకర్షించే వర్గం పాటీదార్లు! పటేల్‌లుగా పిలిచే వీరికి అన్ని పార్టీలూ పెద్దపీట వేస్తుంటాయి. వీరి ఆగ్రహం, అనుగ్రహాలపైనే రాష్ట్రంలో అధికారం ఆధారపడి ఉంటుందనుకుంటుంటాయి. 2017 ఎన్నికల్లో కమలనాథులను భయపెట్టింది ఈ పటేళ్లే! ఇంతకూ ఎవరీ పటేళ్లు? గుజరాత్‌లో వారి హవా ఎంత? ఈసారి వారి దారెటు? గుజరాత్‌ జనాభాలో పాటీదార్ల సంఖ్య సుమారు 15 శాతం. రాష్ట్రంలో చాలామటుకు వ్యవసాయ భూమి వీరిచేతుల్లోనే ఉందంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. స్వాములూ.. జర భద్రం

ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా సుమారు 3 కోట్ల మంది అయ్యప్ప దీక్షలు స్వీకరించి శబరిమల వెళ్లివస్తుంటారు. జనవరిలో మకరజ్యోతి దర్శనానికి వచ్చే వారి సంఖ్య కోటి దాటుతుంది. వారిలో తెలుగు రాష్ట్రాల వారే 60 శాతం మంది ఉంటారు. కీకారణ్యం, ఎత్తయిన పర్వతశ్రేణుల్లో కాలినడకన వెళ్లాల్సి ఉండడం వల్ల కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అఖిలభారత అయ్యప్ప సేవా సంఘం ప్రధాన కార్యదర్శి అరుణ్‌ గురుస్వామి సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అప్పుడు వీధులు ఊడ్చినవాడే..

ఫిఫా ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో గాయపడినా.. ముక్కు నుంచి రక్తం కారుతున్నా కొద్దిసేపు మ్యాచ్‌లో కొనసాగి ఇరాన్‌ గోల్‌కీపర్‌ అలీరజా అభిమానులను ఆకర్షించాడు. మైదానంలోనే కాదు మైదానం బయటా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం అతడికి కొత్తేం కాదు. ఇరాన్‌లోని సరాబ్‌-ఎ-ఆస్‌ అనే చిన్న గ్రామంలో పుట్టిన రజాది పేద కుటుంబం. ఫుట్‌బాల్‌ ఆటగాడిగా మారాలన్నది అతడి కల. కానీ అతడి నాన్న అందుకు ఒప్పుకోలేదు.. రజాను గొర్రెలు కాసే పనిలో పెట్టాలని అనుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అందుకే.. నాలుగు ఖండాలు దాటి ఫుడ్‌ డెలివరీ చేసింది!

సాధారణంగా ఫుడ్‌ డెలివరీ అంటే దేశవ్యాప్తంగా ఆయా జిల్లాలు, రాష్ట్రాలు.. ఇలా కొంత పరిధి మేరకే అందుబాటులో ఉంటుంది. అదే ఏవైనా ముఖ్యమైన వస్తువుల వంటివి ఆర్డర్‌ చేసుకుంటే కొన్ని సందర్భాల్లో రాష్ట్రాలు దాటి కూడా.. వాటిని వినియోగదారుల వద్దకు చేర్చుతుంటారు డెలివరీ చేసే వారు. కానీ ఆర్డర్‌ చేసిన ఆహార పదార్థాల్ని డెలివరీ చేయడానికి ఏకంగా నాలుగు ఖండాలు దాటింది చెన్నైకి చెందిన మానసా గోపాల్‌. సింగపూర్‌ నుంచి మొదలుకొని అంటార్కిటికా వరకు సుమారు 30 వేలకు పైగా కిలోమీటర్లు ప్రయాణించి..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మేధ.. తగ్గించేను ప్రమాద బాధ!

రహదారులెంత బాగున్నా... ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినా... స్పీడ్‌ గన్‌లు ఏర్పాటు చేసినా... జరిమానాలెన్ని వేసినా... మానవ తప్పిదాలు రోడ్లపై మరణ మృదంగాలు మోగిస్తూనే ఉన్నాయి. అందుకే ఈ సమస్యను ఆధునిక పరిజ్ఞానంతో అధిగమించాలంటున్నారు నిపుణులు. ఇందుకు కృత్రిమ మేధ (ఏఐ) సాయం తీసుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలుదేశాల్లో ఇప్పటికే ఈమేరకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ మధ్యే భారత్‌లోనూ ఈ దిశగా అడుగులు పడుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అమ్మో నవంబర్‌...

వాతావరణాన్నే నమ్ముకుంటూ రైతులు ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తుంటారు. ఇప్పుడు అదే వాతావరణం వారి పాలిట శాపంగా మారుతోంది. అందిన కాడికి అప్పులు చేసి సాగు చేసిన పంటలకు భారీ వర్షాల రూపంలో నష్టం వాటిల్లుతోంది. దీంతో పెట్టిన పెట్టుబడులూ చేతికందక అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నవంబర్‌ నెల అంటేనే హడలెత్తుతున్నారు. చిన్న, సన్నకారు రైతులైతే నవంబర్‌ నెలలో వర్షాల ధాటికి శనగ సాగు చేయడానికి కూడా జంకుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పాత ఇల్లు... కొత్త బిల్లు!

2023, జూన్‌ నాటికి ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ హామీని నెరవేరుస్తాం.  ఇళ్లు కాదు.. ఊళ్లకు ఊళ్లే కట్టేస్తున్నాం. రెండు దశల్లో 30 లక్షల ఇళ్లను నిర్దేశించుకున్న గడువులోగా నిర్మిస్తాం. ఇది ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక కార్యక్రమం. -వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల పథకం మొదటి దశ కింద ఇళ్ల నిర్మాణాన్ని 2021, జూన్‌ 2న ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్న మాటలివి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మేల్కొంటే.. ఫుట్‌బాల్‌కు పూర్వ వైభవం!

ఆటలందు ఫుట్‌బాల్‌ అందం వేరు. కప్పులందు సాకర్‌ ప్రపంచ కప్‌ మజా వేరు. ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా ఈవెంట్లలో ఒకటైన ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ పోటీలు మొదలైన దృష్ట్యా నగరాలు, పట్టణాల్లో సందడి నెలకొంది. ఉమ్మడి వరంగల్‌లో మాత్రం ఆ జోష్‌ కనిపించడం లేదు.  అత్యంత ప్రజాదరణ కలిగిన ఈ క్రీడకు ఒకప్పుడు మహబూబాబాద్‌ జిల్లాలోని డోర్నకల్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రస్తుత  వెటరన్‌ క్రీడాకారులు నాడు దానికి వన్నె తెచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని