Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. జగన్‌ది పరదాల యాత్ర.. నాది పాదయాత్ర
‘సీఎం జగన్ తప్పుడు మార్గంలో వెళుతున్నందునే ఎక్కడికెళ్లినా పరదాలు కట్టుకుంటున్నారు. 30 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నారు. నేను ఏ తప్పూ చేయలేదు కాబట్టే.. ధైర్యంగా రోడ్లపై తిరుగుతున్నా. జగన్‌మోహన్‌రెడ్డిది పరదాల యాత్ర. నాది పాదయాత్ర’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. యువగళం పాదయాత్ర 56వ రోజు శుక్రవారం శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం కోనక్రాస్ నుంచి ప్యాదిండి వరకు కొనసాగింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. జైలుకెళ్లినా పోటీ చేయొచ్చు!
పోర్న్ స్టార్‌కు ముడుపుల వ్యవహారంలో అభియోగాలు నమోదైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవితవ్యం ఏంటి? 2024లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఉబలాటపడుతున్న ఆయన ఆశలిక అడియాసలైనట్లేనా? పోటీకి దూరంగా ఉండాల్సిందేనా? అంటే... అదేం లేదనే సమాధానం వస్తోంది. నేరం రుజువై జైలుకెళ్లినా అధ్యక్ష పదవికి అర్హుడే అంటోంది అమెరికా రాజ్యాంగం! పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. మా అమ్మ కన్నీటితో డైరీ తడిసిపోయింది
చైనాలోని ఏక సంతాన విధానం వల్ల తన తల్లి అనుభవించిన బాధను ఓ యువతి ట్విటర్ వేదికగా షేర్ చేసింది. ఆమె ట్వీట్లు చూసినవారు ‘హృదయవిదారకం’ అంటూ సందేశాలు పెడుతున్నారు. చైనాలో దశాబ్దాలుగా కొనసాగిన ఈ కఠిన నిబంధన ఎందరో తల్లుల జీవితాల్లో వేదనను మిగిల్చింది. ఒకరి కంటే ఎక్కువమంది పిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రులు ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఈ నిబంధనను వెనక్కి తీసుకున్నా.. దానివల్ల కలిగిన మానసిక కలవరం అక్కడి తల్లుల మదిలో నుంచి చెరిగిపోలేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. పింఛను కోసం 15 ఏళ్ల పాటు అంధురాలిగా నటన
ప్రభుత్వ పింఛను కోసం ఓ మహిళ అంధురాలిగా నటించింది. ఏకంగా 15 ఏళ్ల పాటు అధికారులను బోల్తా కొట్టించిన ఆమె ఓ చిన్న పొరపాటుతో దొరికిపోయింది. ఇటలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. 48 ఏళ్ల ఆ మహిళ తాను అంధురాలినంటూ 15 ఏళ్ల క్రితం వైద్యుడి నుంచి ధ్రువీకరణ పత్రం పొందింది. సామాజిక భద్రత పింఛనుకు దరఖాస్తు చేసుకుంది. ఆమె నిజంగానే అంధురాలు అని నమ్మిన అధికారులు పింఛను మంజూరు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. గుర్రాల పెంపకంతో భలే ఆదాయం
పంజాబ్‌కు చెందిన గుర్‌తేజ్ సింగ్ అనే రైతు గుర్రాల వ్యాపారంతో రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. వ్యవసాయానికి అనుబంధంగా స్టడ్ ఫామ్(అశ్వాల పెంపకం)ను నిర్వహిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. ఇందులో చాలా తక్కువ నిర్వహణ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందొచ్చని చెబుతున్నారు. బఠిండా జిల్లాలోని నరువానా గ్రామానికి చెందిన గుర్‌తేజ్ తొలుత రూ.లక్షన్నరతో రెండు గుర్రాలను కొన్నారు. వాటి పిల్లల్లో కొన్నింటిని విక్రయిస్తూ వచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో కొత్త టోల్‌ఛార్జీలు
జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను కేంద్రం అయిదు శాతం పెంచడంతో ఆ భారాన్ని ప్రయాణికులపై వేయడానికి ఆర్టీసీ సిద్ధమైంది. కొత్త ఛార్జీలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయి. ఆర్డినరీ నుంచి గరుడ ప్లస్ వరకు బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడిపై టోల్‌ప్లాజా ఛార్జీలను తాజాగా రూ.4 పెంచినట్లు తెలిసింది. ఇటీవల ప్రవేశపెట్టిన నాన్ ఏసీ స్లీపర్ బస్సులో రూ.15, ఏసీ స్లీపర్‌లో రూ.20 టోల్‌ఛార్జీ వసూలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. చదరపు అడుగు రూ.1.36 లక్షలు
హైదరాబాద్‌లో చదరపు అడుగు రూ.5-16 వేల వరకు ఉంది. అయితే ముంబయిలో చదరపు అడుగు రూ.1.36 లక్షల చొప్పున ఒక విలాసవంత అపార్టుమెంటులో ట్రిప్లెక్స్ అమ్ముడుపోయిందని ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. దక్షిణ ముంబయిలోని మలబార్ హిల్‌లో రూ.369 కోట్లకు లగ్జరీ ట్రిప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను ఔషధ ఉత్పత్తుల సంస్థ ఫామీ కేర్ అధిపతి జేపీ తపారియా కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారు. లోధా గ్రూప్ సంస్థ మ్యాక్రోటెక్ డెవలపర్స్ ఈ అపార్ట్‌మెంట్‌ను విక్రయించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ప్రేమలో బ్రేకప్..పరిహారం రూ.25వేలు
అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడటం ఈరోజుల్లో కామన్. ఖర్మ కాలి విడిపోవడమూ ఎక్కువే!. ఇలాంటి సందర్భంలో ఇద్దరిలో ఒక్కరి గుండె అయినా పగిలిపోతుంది. భగ్న ప్రేమికులై విషాద గీతాలు పాడుకుంటారు. ఈ బాధలో ఉన్నవాళ్లకు ఏదైనా పరిహారం దక్కితే కొంతలో కొంతైనా ఓదార్పుగా ఉంటుంది కదూ! ప్రతీక్ ఆర్యన్ అనే కుర్రాడు ఇలాగే ‘హార్ట్‌బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్’ కింద రూ.25వేలు అందుకున్నాడు. అదెలాగంటే.. ప్రతీక్‌కి ఒకమ్మాయితో రిలేషన్‌షిప్ మొదలైనప్పుడు ఇద్దరు కలిసి ఓ జాయింట్ ఖాతా ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. వేడిగా.. చల్లబరుస్తాయ్!
వేసవిలో డీహైడ్రేషన్ అని టీ, కాఫీలకు వీలైనంత దూరంగా ఉండమంటారు. టీ తాగనిదే పని ముందుకెళ్లదు కొందరికి! మరి అలాంటి వాళ్ల పరిస్థితేంటి? వీటిని ప్రయత్నిస్తే సరి! హైబిస్కస్ టీ.. వేడి తాపం నుంచి రక్షించడంలో ఈ టీ ముందుంటుంది. రక్తపోటును తగ్గిస్తుంది. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరాన్ని శుద్ధి చేయడంతో పాటు నెలసరి సమయంలో నొప్పినీ, ఆందోళననీ దూరం చేస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. Vikram: కేజీఎఫ్‌లోకి అడుగుపెట్టిన విక్రమ్
సరికొత్త పాత్రలకి పెట్టింది పేరైనా విక్రమ్ (Vikram) నటిస్తున్న మరో వైవిధ్యమైన చిత్రం ‘తంగలాన్’. పా రంజిత్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా తంగలాన్ షూటింగ్ కోసం కేజీఎఫ్‌లోకి అడుగు పెట్టానంటూ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు విక్రమ్. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. బ్రిటిష్ పరిపాలనలో కోలార్ గోల్డ్ ఫ్యాక్టరీలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
నా భర్త కళ్లలో చెదరని నిశ్చలత చూశా
-
India News
ప్రపంచంలో ఎక్కడినుంచైనా శబరి గిరీశునికి కానుకలు
-
India News
ప్రతి 5 విద్యార్థి వీసాల్లో ఒకటి భారతీయులకే.. అమెరికా రాయబారి వెల్లడి
-
World News
Space: ఇకపై అంతరిక్షంలో వ్యోమగాములు ఫ్రెంచ్ ఫ్రైస్ తినొచ్చు!
-
India News
Odisha Train Accident: ఏఐ సాంకేతికతతో మృతదేహాల గుర్తింపు!
-
Movies News
Social Look: ఐస్‌క్రీమ్‌తో రకుల్‌ప్రీత్.. చెప్పుతో తేజస్విని.. తమన్నా ప్రచారం!