Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 04 Mar 2024 20:58 IST

1. సర్కారు బడిలో చదివే ఈ స్థాయికి ఎదిగా: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రభుత్వ పాఠశాలలోనే చదివి తాను ఈ స్థాయికి ఎదిగానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎల్బీ స్టేడియంలో లెక్చరర్లు, టీచర్లు ఉద్యోగాలకు ఎంపికైన 5,192 మందికి నియామక పత్రాలను ఆయన అందజేశారు. మూడు నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏది అభివృద్ధో..?ఏది దోపిడీనో.. గుర్తించి ఓటేయాలి: చంద్రబాబు

స్వార్థం కోసం తెదేపా-జనసేన కలవలేదని.. ఆంధ్రప్రదేశ్‌ను రక్షించుకునేందుకే కలిశాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. పెనుకొండలో నిర్వహించిన ‘ రా.. కదలిరా’ సభలో ఆయన మాట్లాడారు. ఏది అభివృద్ధో..?ఏది దోపిడీనో.. గుర్తించి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలని పిలుపునిచ్చారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. 4 ఎంపీ స్థానాలకు భారాస అభ్యర్థులు ఖరారు

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు నలుగురు అభ్యర్థులను భారాస అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. కరీంనగర్‌ నుంచి వినోద్‌కుమార్‌, పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్‌, ఖమ్మం - నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్‌ నుంచి మాలోత్‌ కవిత పేర్లను ఖరారు చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రెండు రోజులుగా ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనేతలతో కేసీఆర్‌ చర్చించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మార్చి నుంచే మాడు పగిలే ఎండలు.. ఏప్రిల్, మేలో మరింత అధికం

ఏపీలో మార్చి నుంచే తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే సూచనలు ఉన్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ఏప్రిల్, మే నెలల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. స్పీకర్‌కు ‘తాళం’ గిఫ్ట్‌గా ఇచ్చిన ముఖ్యమంత్రి.. ఎందుకంటే!

పంజాబ్‌ అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఓ అంశంపై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు సభలోనే ఉండేలా చూడాలంటూ స్పీకర్‌ను ముఖ్యమంత్రి కోరారు. అంతేకాకుండా తాళం, కీ ఇచ్చిన సీఎం.. వాకౌట్‌ చేయకుండా వారిని సభలోనే ఉండేలా లోపల గడియపెట్టాలని విజ్ఞప్తి చేయడం మరింత గందరగోళానికి దారితీసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. IIFLకు ఆర్‌బీఐ షాక్‌.. గోల్డ్‌ లోన్ల జారీ నిలిపివేయాలని ఆదేశం

ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌కు (IIFL finance) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) షాకిచ్చింది. తక్షణమే బంగారంపై రుణాల జారీని నిలిపివేయాలని ఆదేశించింది. గోల్డ్‌ లోన్‌ విభాగంలో కొన్ని లోపాలను గుర్తించిన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రుణ పోర్ట్‌ఫోలియోపైనా, రుణ రికవరీపైనా ఎలాంటి ఆంక్షలు వర్తించవని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. డిజిటల్‌ చెల్లింపుల్లో 46శాతం భారత్‌లోనే: ఆర్‌బీఐ గవర్నర్‌

గత 12 ఏళ్లలో దేశంలో డిజిటల్‌ లావాదేవీలు 90 రెట్లు పెరిగాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. ప్రపంచంలోని మొత్తం ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో (Digital Payments) దాదాపు సగం మన దేశంలోనే జరుగుతున్నాయని తెలిపారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రెజ్లింగ్‌ను మళ్లీ కొనసాగించలేను : సాక్షి మాలిక్‌

రెజ్లింగ్‌ పోటీల్లో మళ్లీ పాల్గొనే అంశంపై వస్తోన్న వార్తలను ఒలింపిక్స్‌ కాంస్య విజేత సాక్షి మాలిక్‌ (Sakshi Malik) తోసిపుచ్చారు. రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలంగా చేస్తోన్న నిరసనలు మానసిక వేదనకు గురిచేశాయన్నారు. గతేడాది డిసెంబర్‌లో రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆమె.. మళ్లీ పోటీల్లో పాల్గొనే అవకాశం లేదన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ప్రస్తుతం విద్య అందుబాటులో లేనిదిగా మారింది: ముంబయి హైకోర్టు

భారతీయ సంస్కృతిలో ఒకప్పుడు విద్యకు ఎంతో పవిత్రత ఉండేదని, కానీ, ప్రస్తుతం అటువంటి విద్య విద్యార్థులకు అందుబాటులో లేకుండా పోయిందని బాంబే హైకోర్టు (Bombay High Court) పేర్కొంది.  నాణ్యమైన విద్య అందరికీ అందేలా చూడటం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అవుట్‌డోర్‌ పార్టీపై విచక్షణారహితంగా కాల్పులు.. నలుగురి మృతి!

అమెరికా (USA)లో మరోసారి కాల్పుల (Shooting) ఘటన కలకలం రేపింది. ఓ బహిరంగ వేడుక (Outdoor Party)పై గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని