Shooting: అవుట్‌డోర్‌ పార్టీపై విచక్షణారహితంగా కాల్పులు.. నలుగురి మృతి!

అమెరికాలోని కాలిఫోర్నియాలో బహిరంగంగా జరుపుకుంటున్న వేడుకపై గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు.

Published : 04 Mar 2024 17:05 IST

వాషింగ్టన్‌: అమెరికా (USA)లో మరోసారి కాల్పుల (Shooting) ఘటన కలకలం రేపింది. ఓ బహిరంగ వేడుక (Outdoor Party)పై గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

పోలీసుల వివరాల ప్రకారం.. సెంట్రల్‌ కాలిఫోర్నియాలోని కింగ్‌ సిటీలో ఏర్పాటుచేసిన ఓ అవుట్‌డోర్‌ పార్టీకి పలువురు హాజరయ్యారు. అంతలోనే ముసుగులు ధరించి, కారులో అక్కడికి చేరుకున్న ముగ్గురు దుండగులు ఒక్కసారిగా వారిపై కాల్పులకు తెగబడ్డారు.

అమెరికాలో చెదిరిన నృత్య కల

ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందారు. అనంతరం దుండగులు అదే కారులో పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకునే దిశగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని