BRS: 4 ఎంపీ స్థానాలకు భారాస అభ్యర్థులు ఖరారు

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు నలుగురు అభ్యర్థులను భారాస అధినేత కేసీఆర్‌ ప్రకటించారు.

Updated : 04 Mar 2024 20:01 IST

హైదరాబాద్‌: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు నలుగురు అభ్యర్థులను భారాస అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. కరీంనగర్‌ నుంచి వినోద్‌కుమార్‌, పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్‌, ఖమ్మం - నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్‌ నుంచి మాలోత్‌ కవిత పేర్లను ఖరారు చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రెండు రోజులుగా ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనేతలతో కేసీఆర్‌ చర్చించారు. సమష్ఠి నిర్ణయం ప్రకారం ఏకగీవ్రంగా ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లను వెల్లడించారు.

రాబోయే కాలం మనదే: కేసీఆర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావడం లేదని కేసీఆర్‌ విమర్శించారు. ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల నేతలతో ఇవాళ ఆయన సమావేశమయ్యారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, కవిత పాల్గొన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సమావేశానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. కరీంనగర్‌ తర్వాత ఖమ్మంలో కూడా సభ ఉంటుందని నేతలకు కేసీఆర్‌ స్పష్టం చేశారు. ‘‘రాబోయే కాలం మనదే. నేతలు కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థులను గెలిపించుకోవాలి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురితో సమన్వయ కమిటీ ఉండాలి’’ అని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని