Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 15 Mar 2024 13:04 IST

1. మాజీ మంత్రి వివేకా ఐదో వర్ధంతి.. నివాళులర్పించిన సునీత

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా పులివెందులలో ఘాట్‌ వద్ద ఆయన కుమార్తె సునీతా నర్రెడ్డి నివాళులర్పించారు. భర్త రాజశేఖర్‌రెడ్డి, కుటుంబసభ్యులతో కలిసి ఆమె వెళ్లారు. అనంతరం వివేకా పార్కు వద్ద విగ్రహానికి పూలమాలలు వేశారు. పూర్తి కథనం

2. BRS-BSP: భారాసతో పొత్తు.. బీఎస్పీకి రెండు ఎంపీ సీట్లు

లోక్‌సభ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి (భారాస), బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) మధ్య పొత్తు ఖరారైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీట్ల కేటాయింపు జరిగింది. బీఎస్పీకి 2 ఎంపీ సీట్లను కేటాయిస్తూ భారాస నిర్ణయం తీసుకుంది.పూర్తి కథనం

3. పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సోదరుడి అరెస్టు

పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పటాన్‌చెరు మండలం లక్డారం గ్రామంలో ఆయన సంతోష్‌ గ్రానైట్‌ మైనింగ్ పేరుతో క్రషర్‌ కంపెనీలు నిర్వహిస్తున్నారు. పరిమితికి మించి గుట్టల్ని తవ్వేస్తున్నారని, అనుమతుల గడువు అయిపోయినా మైనింగ్ చేశారని ఆయనపై ఆరోపణలున్నాయి.పూర్తి కథనం

4. బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యడియూరప్పపై పోక్సో కేసు నమోదు

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపా (BJP) సీనియర్‌ నేత, కర్ణాటక (Karnataka) మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌. యడియూరప్ప (81) (Yediyurappa)పై లైంగిక వేధింపుల ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. 17 ఏళ్ల బాలికపై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదులు వచ్చాయి.పూర్తి కథనం

5. దీదీ తలకు గాయం.. వెనక నుంచి తోయడం వల్లేనా..?

గాయపడిన తృణమూల్‌ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. వెనక నుంచి నెట్టడం వల్ల ఆమె కిందపడిపోయినట్లు కనిపిస్తోందని తెలిపారు.పూర్తి కథనం

6. రష్యా అధ్యక్ష ఎన్నికలకు.. కేరళలో పోలింగ్‌

రష్యా అధ్యక్ష ఎన్నికలకు (Russia Presidential Elections) శుక్రవారం పోలింగ్‌ ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రక్రియలో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే.. ఈ ఎన్నికల కోసం మన దేశంలోని కేరళ (Kerala)లో పోలింగ్‌ ఏర్పాట్లు చేశారు. ఈ రాష్ట్రంలో నివసించే రష్యన్‌ పౌరులు ఇక్కడి నుంచే అధ్యక్ష ఎన్నికల్లో తమ ఓటు (Voting) వేసేందుకు వీలుగా దీన్ని ఏర్పాటు చేశారు.పూర్తి కథనం

7. ఎన్నికల బాండ్ల పూర్తి డేటా ఎందుకు ఇవ్వలేదు?: SBIపై సుప్రీం ఆగ్రహం

ఎన్నికల బాండ్ల (Electoral bonds) వ్యవహారంలో భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (SBI)పై సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం బాండ్ల పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి (EC) ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది.పూర్తి కథనం

8. గాజాలో ఆహారం అర్థిస్తున్న వారిపై కాల్పులు.. 20 మంది మృతి!

ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధానికి (Israel Hamas conflict) కేంద్రంగా మారిన గాజాలో మరో ఘోర ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఆహారం కోసం వేచి చూస్తున్న సమూహంపై కాల్పులు జరిగినట్లు సీఎన్‌ఎన్‌ పేర్కొంది. ఈ ఘటనలో కనీసం 20 మంది మరణించారని తెలుస్తోంది. మరో 155 మంది తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం.పూర్తి కథనం

9. యూపీఐ సేవలకు అనుమతి.. అప్పర్‌ సర్క్యూట్‌ తాకిన పేటీఎం షేర్లు

పేటీఎం (Paytm) పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వన్‌ 97 కమ్యూనికేషన్‌ షేర్లు పుంజుకున్నాయి. శుక్రవారం మార్కెట్ ప్రారంభమైన తర్వాత బీఎస్ఈలో ఐదు శాతం పెరిగి రూ.370.90 దగ్గర అప్పర్‌ సర్క్యూట్‌ తాకాయి. గురువారం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా (NPCI) పేటీఎం ద్వారా డిజిటల్‌ చెల్లింపులు చేసేందుకు వన్‌97 కమ్యూనికేషన్‌కు థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్‌ (TPAP)ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే.పూర్తి కథనం

10. భారాస నేతలను టార్గెట్‌ చేస్తున్నారు: మాజీ మంత్రి హరీశ్‌రావు

ప్రజలకు సేవ చేయడం కంటే ప్రతిపక్షాలను వేధించడమే పనిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పెట్టుకుందని భారాస నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆ పార్టీలో చేరకుంటే అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని