Adilabad: గణేశ్ నిమజ్జనంలో సందడి చేసిన WWE స్టార్
డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ రెజ్లర్ ది గ్రేట్ ఖలీ ఆదిలాబాద్‌లో సందడి చేశారు.
ఆదిలాబాద్ సాంస్కృతికం: డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ రెజ్లర్ ది గ్రేట్ ఖలీ ఆదిలాబాద్‌లో సందడి చేశారు. గురువారం మహాలక్ష్మి గణేశ్ మండల్ అధ్యక్షుడు ఆదిత్య ఖండేష్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నిమజ్జోత్సవ శోభాయాత్రలో ఖలీ పాల్గొని నగరంలో సందడి చేశారు. తమ అభిమాన రెజ్లర్‌ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. పలువురు అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా ఖలీ ప్రజలను కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
పదవీ విరమణ వయసులో.. సెక్యూరిటీ గార్డు డబుల్ పీజీ
-
యూపీలో అపహరణ.. హైదరాబాద్‌లో అత్యాచారం
-
ఏపీకి తుపాను ముప్పు.. డిసెంబరు తొలి వారంలో అతి భారీ వర్షాలు!
-
Cyber Attack: అమెరికా ఆస్పత్రులపై సైబర్ దాడి.. నిలిచిపోయిన వైద్య సేవలు
-
Rishab Shetty: అది చాలా బాధాకరం: ఓటీటీ సంస్థలపై రిషబ్ శెట్టి
-
Salaar: అందుకు వారికి సారీ.. ‘సలార్’ రూమర్స్‌పై ప్రశాంత్ నీల్ క్లారిటీ