2 గంటల్లో దెహ్రాడూన్‌ నుంచి దిల్లీకి

రానున్నరోజుల్లో దేశ రాజధాని నుంచి డెహ్రాడూన్‌ వరకు కేవలం రెండు గంటల్లోనే రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించవచ్చు. ఈ మేరకు  రెండు నగరాల మధ్య నిర్మాణంలో ఉన్న ఆరు లైన్ల రహదారి 2024 నాటికి పూర్తవుతుందని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు.  ఉత్తరాఖండ్‌లోని నాలుగు జాతీయ రహదారుల నిర్మాణ పనులను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.  ప్రస్తుతం దిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌ రాజధానికి వెళ్లడానికి 5 గంటల సమయం పడుతోంది...

Updated : 28 Feb 2021 04:59 IST

2024 నాటికి ఆరు లైన్ల రహదారి పూర్తి..
 కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ 
 

హరిద్వార్‌: భవిష్యత్తులో దేశ రాజధాని దిల్లీ నుంచి దెహ్రాడూన్‌‌ వరకు కేవలం రెండు గంటల్లోనే రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించవచ్చని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఈ మేరకు రెండు నగరాల మధ్య నిర్మాణంలో ఉన్న ఆరు వరుసల రహదారి 2024 నాటికి పూర్తవుతుందని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లోని నాలుగు జాతీయ రహదారుల నిర్మాణ పనులను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం దిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌ రాజధానికి వెళ్లడానికి 5 గంటల సమయం పడుతోంది. ఈ రహదారి పూర్తయితే ప్రయాణ సమయం తగ్గి రెండు గంటల్లోనే దిల్లీ నుంచి దెహ్రాడూన్‌కు చేరుకోవచ్చని మంత్రి వివరించారు. ఈ రెండు నగరాల మధ్య ఎక్స్‌ప్రెస్‌ వే దూరం 210 కిలోమీటర్లు కాగా,  రహదారి నిర్మాణానికి రూ.13,000 కోట్లు  ఖర్చవుతోందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని