IMA: కరోనాకు 420 మంది వైద్యుల బలి

కొవిడ్‌ మహమ్మారిపై పోరులో భాగంగా నిత్యం కరోనా రోగుల ప్రాణాలు కాపాడుతున్న వైద్యులు కూడా కరోనా కాటుకు గురవుతున్నారు. గత ఏడాది కాలంగా కుటుంబాలకు దూరంగా ఉంటూ ఆస్పత్రులకే పరిమితమైన వైద్యులు ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అనేక మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు.

Published : 22 May 2021 21:31 IST

దిల్లీ: కొవిడ్‌ మహమ్మారిపై పోరులో భాగంగా నిత్యం కరోనా రోగుల ప్రాణాలు కాపాడుతున్న వైద్యులు కూడా కరోనా కాటుకు గురవుతున్నారు. గత ఏడాది కాలంగా కుటుంబాలకు దూరంగా ఉంటూ ఆస్పత్రులకే పరిమితమైన వైద్యులు ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అనేక మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. గతేడాదిలో వచ్చిన కరోనా ఫస్ట్‌ వేవ్‌లో దేశవ్యాప్తంగా 748 మంది వైద్యులు మరణించారు. రెండో ఉద్ధృతి ప్రభావంతో ఇప్పటి వరకు 420 మంది వైద్యులు మరణించినట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) వెల్లడించింది. అత్యధికంగా దిల్లీలో 100 మందికి పైగా మరణించగా, బిహార్‌లో 96 మంది, ఉత్తర ప్రదేశ్‌లో 41 మంది మృతి చెందారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రజలకు, ఫ్రంట్‌ లైన్‌లో వైద్యులకు ప్రాణాంతకంగా పరిణమించిందని ఐఎంఏ అధ్యక్షుడు జేఏ జయలాల్‌ అన్నారు.

శుక్రవారం ఆరోగ్య కార్యకర్తలతో మాట్లాడిన ప్రధాని మోదీ దేశంలో కరోనా వల్ల అనేక మంది మృతి చెందుతున్నారని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని