మయన్మార్‌లో ఆగని విధ్వంసం: ఏడుగురి కాల్చివేత

మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. సైన్యం జరిపిన కాల్పుల్లో ఏడుగురు పౌరులు మరణించారు. మాండలేలలో నలుగురు, పీఐలో ఇద్దరు, యాంగూన్‌లో ఒక్కరిని సైనికులు కాల్చిచంపారు....

Published : 14 Mar 2021 11:58 IST

యాంగూన్‌: మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. సైన్యం జరిపిన కాల్పుల్లో ఏడుగురు పౌరులు మరణించారు. మాండలేలలో నలుగురు, పీఐలో ఇద్దరు, యాంగూన్‌లో ఒక్కరిని సైనికులు కాల్చిచంపారు. సైనిక కాల్పుల్లో అనేక మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆందోళనలో గాయాలపాలైన వారితో మయన్మార్‌లోని ఆసుపత్రులు నిండిపోయాయి. ఇప్పటివరకు సైన్యం జరిపిన కాల్పుల్లో 70 మందికి పైగా ప్రజలు మరణించినట్లు ఐరాసకు చెందిన మానవహక్కుల నిపుణులు టామ్‌ ఆండ్రూస్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని