ముంబయిలోనూ బాణసంచాపై నిషేధం

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు నగరాలు బాణసంచా విక్రయాలు, పేల్చడాన్ని నిషేధిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో ముంబయి కూడా చేరింది. మహమ్మారిని నియంత్రించడంలో భాగంగానే...........

Published : 09 Nov 2020 18:08 IST


ముంబయి: దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు నగరాలు బాణసంచా విక్రయాలు, పేల్చడాన్ని నిషేధిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో ముంబయి కూడా చేరింది. మహమ్మారిని నియంత్రించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బృహత్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) వివరించింది. అయితే నవంబర్‌ 14న లక్ష్మీపూజ సందర్భంగా స్వల్ప స్థాయిలో పొగ విడుదలయ్యే కాకరపువ్వొత్తుల వంటి చిన్న చిన్న పటాకులను కాల్చేందుకు అనుమతించింది. కొవిడ్‌ నిబంధనల్ని పాటిస్తూ.. జాగ్రత్తగా జరుపుకోవాలని సూచించింది. దీపావళి సందర్భంగా ప్రజలు బాణసంచాకు దూరంగా ఉండాలని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కోరిన నేపథ్యంలో బీఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. బాణసంచా నుంచి వెలువడే పొగతో కాలుష్యం ఏర్పడి కొవిడ్‌ మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.

ఇదీ చదవండి..
కొవిడ్‌ చుట్టం.. కాలుష్యం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని