దేవేంద్ర ఫడణవీస్‌కు కరోనా 

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిహార్ ఎన్నికల ప్రచార ఇంఛార్జి దేవేంద్ర ఫడణవీస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Published : 25 Oct 2020 02:07 IST

నేను విశ్రాంతి తీసుకోవాలని దేవుడి కోరిక

ముంబయి: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిహార్ ఎన్నికల ప్రచార ఇంఛార్జి దేవేంద్ర ఫడణవీస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శనివారం ట్విటర్ ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘లాక్‌డౌన్‌ అప్పటినుంచి కూడా నేను ప్రతిరోజు పనిచేస్తూనే ఉన్నాను. అందుకే నేను కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని దేవుడు కోరుకున్నట్టు అనిపిస్తుంది. నాకు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాను. వైద్యులు సూచించిన విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో నాతో సన్నిహితంగా ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను’ అంటూ ట్వీట్లు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో గత నెల దేవేంద్ర ఫడణవీస్‌ను ఆ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జిగా భాజపా నియమించింది.

కాగా, గురువారం బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ కూడా తాను కరోనా బారిన పడినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా..దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో మొదటగా నిర్వహిస్తున్న అసెంబ్లీ ఎన్నికలివి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని