చర్చలకు రెడీ.. రైతులకు కేంద్రం మరో లేఖ!

మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దులో ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది........

Published : 24 Dec 2020 17:09 IST

దిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దులో ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్‌ అగర్వాల్‌ రైతు సంఘాల నేతలకు గురువారం లేఖ రాశారు. రైతులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో పేర్కొన్నారు. తేదీని ఖరారు చేసుకొని రైతులు చర్చలకు రావాలన్నారు.

వ్యవసాయ చట్టాల్లో సవరణలు చేస్తామంటూ కేంద్రం పదేపదే చెబుతుండటం ఆపాలని, అది అర్ధరహితంగా ఉందని రైతు సంఘాల నేతలు బుధవారం అన్నారు. కేంద్రం ఆరో దఫా చర్చలకు ఆహ్వానిస్తూ రాసిన లేఖను తిరస్కరించిన విషయం తెలిసిందే. నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తే చర్చలకు సిద్ధమేనంటూ రైతులు స్పష్టంచేసిన నేపథ్యంలో తాజాగా కేంద్రం రైతులను చర్చలకు ఆహ్వానిస్తూ లేఖ రాయడం గమనార్హం. 

ఇదీ చదవండి
ప్రేమలేఖలొద్దు.. నిర్మాణాత్మక ప్రతిపాదనతో రండి

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని