
మాస్కులతో క్యాట్‌వాకు.. కరోనా దరిచేరమాకు!
ఇంటర్నెట్‌డెస్క్: ఫ్యాషన్ షో అనగానే.. వయ్యారాలు ఒలకబోస్తూ నడిచే అందమైన భామలు.. ధగధగ లాడే దుస్తులు.. తలతల మెరిసే ఆభరణాలే గుర్తొస్తాయి. ఈ జాబితాలో ఇప్పుడు కొత్త ఆభరణం వచ్చి చేరింది. కొవిడ్-19 పుణ్యమా అని ఇందులో ఫేస్‌మాస్క్ కూడా అంతర్భాగమైపోయింది. ఈ వినూత్న ఫ్యాషన్‌షోకు దక్షిణ కొరియా రాజధాని సియోల్ వేదికైంది.
ఇటీవల జరిగిన ఈ ఫ్యాషన్ షోలో పాల్గొన్న ప్రతి ఒక్క మోడల్ కూడా ఫేస్‌మాస్క్ ధరించడం గమనార్హం. కరోనా నుంచి రక్షణ పొందేందుకు ఏదో మాస్కు ధరించాం అన్నట్లు కాకుండా.. దుస్తులకు నప్పే మాస్కులను డిజైనర్లు రూపొందించడం గమనార్హం. విభిన్న డిజైన్లలో, విభిన్న రంగుల దుస్తులతో పాటు విభిన్న రకాల ఫేస్‌మాస్కులు కూడా ఈ షోలో దర్శనమిచ్చాయి.
‘‘ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా క్లిష్ట పరిస్థితి నెలకొంది. కరోనాకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు పోరాడుతున్నారు. ఇలాంటి స్థితిలో వారిలో ఓ కొత్త ఉత్సాహం నింపేందుకు ఈ షో నిర్వహిస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు నిర్వాహకులు లిమ్ యాన్ హీ. అంతేకాదు కొవిడ్-19 కారణంగా ఇతర ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయిన వేళ దాన్ని అధిగమించడంలో భాగంగా దీన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దక్షిణకొరియాలో మొత్తం కేసుల సంఖ్య 14వేలు దాటగా.. మరణాల సంఖ్య 300కు చేరువైంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Manasanamaha: గిన్నిస్ వరల్డ్‌రికార్డు సాధించిన ‘మనసానమః’
-
Politics News
Agnipath scheme: కేంద్రం ఓ కాపీ క్యాట్.. ఎత్తుకొచ్చిన పథకాలు ఇక్కడ సూట్ కావు: కాంగ్రెస్ ఎంపీ
-
Politics News
Telangana News: సీఎంను ప్రజలే పట్టించుకోవట్లేదు.. భాజపా సైతం పట్టించుకోదు: బండి సంజయ్
-
Movies News
Vivek Oberoi: ‘రక్తచరిత్ర’.. ఆ ఘటన ఎప్పటికీ మర్చిపోను: వివేక్ ఒబెరాయ్
-
Sports News
Pakistan: ఒకరు విజయవంతమైతే.. మా సీనియర్లు తట్టుకోలేరు: పాక్ క్రికెటర్
-
World News
South Africa: దక్షిణాఫ్రికా నైట్‌క్లబ్‌లో అనుమానాస్పద స్థితిలో 17 మంది మృతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్‌ఖాన్‌ని వదులుకున్నా!
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- Atmakur ByElection: ఆత్మకూరు ఉపఎన్నిక.. వైకాపా ఏకపక్ష విజయం
- Teesta Setalvad: పోలీసుల అదుపులో తీస్తా సీతల్వాడ్
- AP Liquor: మద్యంలో విషం
- ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు
- Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా
- AP sachivalayam: జులై 1 నుంచి ప్రొబేషన్