10రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ!

దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. వివిధ రాష్ట్రాల్లో వైరస్‌ తీవ్రతపై మోదీ సమీక్ష చేస్తున్నారు.

Updated : 11 Aug 2020 12:11 IST

కరోనా ప్రభావం, కట్టడి చర్యలపై మోదీ సమీక్ష
పాల్గొన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. వివిధ రాష్ట్రాల్లో వైరస్‌ తీవ్రతపై మోదీ సమీక్ష చేస్తున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత పరిస్థితులు, అన్‌లాక్‌ 3 అమలు జరుగుతున్న తీరుతెన్నులపై సీఎంలను అడిగి తెలుసుకుంటున్నారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రులు ప్రధానికి వివరించనున్నారు. ఈ సమీక్షలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులతోపాటు పది రాష్ట్రాల సీఏంలు పాల్గొన్నారు.

కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, గుజరాత్‌, ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రులతోపాటు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, వైద్య ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌, హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఈ సమీక్షకు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రధానికి వివరించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ ఉదయం 11గంటలకు ఈ సమీక్షా సమావేశం ప్రారంభమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని