IAF: వాయుసేన అపాచీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
భారత వాయుసేనకు చెందిన అపాచీ హెలికాప్టర్‌కు ప్రమాదం తప్పింది. దీనిలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని గుర్తించి పైలట్ అత్యవసరంగా పొలాల్లో ల్యాండింగ్ చేశాడు.
ఇంటర్నెట్‌డెస్క్: భారత వాయుసేన(IAF)కు చెందిన ఓ అపాచీ అటాక్ హెలికాప్టర్( Apache helicopter) మధ్యప్రదేశ్‌లోని భింధ్ వద్ద అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ హెలికాప్టర్లో సాంకేతిక లోపం గుర్తించడంతో పైలట్ వెంటనే దీనిని పొలాల్లో ల్యాండ్ చేశాడు. పైలట్ అప్రమత్తతో ఓ పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. ఈ హెలికాప్టర్లో సాంకేతిక లోపాన్ని సరిచేసి మళ్లీ గమ్యస్థానానికి పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే దీనికి సాయం చేసేందుకు మరో హెలికాప్టర్‌ను అక్కడికి పంపారు. శిక్షణ కార్యక్రమంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకొన్నట్లు సమాచారం. పైలట్ సురక్షితంగా ఉన్నారు. ఈ హెలికాప్టర్‌ను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ ఎత్తున ఘటనా స్థలానికి చేరుకొన్నారు.
భారత దళాల్లో వినియోగిస్తున్న హెలికాప్టర్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ నెల మొదట్లో భారత సైన్యానికి చెందిన ధ్రువ్ జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్ జిల్లా అటవీ ప్రాంతంలో అత్యవసరంగా దించేందుకు ప్రయత్నిస్తుండగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సాంకేతిక నిపుణుడు పబ్బల్ల అనిల్(29) మృతి చెందగా, ఇద్దరు పైలట్లు గాయపడ్డారు. అనిల్ తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వాసి. మార్చిలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్ జిల్లా మండలా పర్వత ప్రాంతాల్లో ఓ సైనిక హెలికాప్టర్ కూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. అదే నెలలో భారత నౌకాదళానికి చెందిన హెలికాప్టర్ ముంబయి తీరంలో అత్యవసరంగా నీటిపై ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ హెలికాప్టర్‌లో ముగ్గురు సిబ్బంది ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
IPAC-YSRCP: ప్రభుత్వ కార్యక్రమంలో ‘ఐ’ప్యాక్!
-
TS News: భారాసకు రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గుడ్‌బై
-
Nara Bhuvaneswari: నారా భువనేశ్వరి బస్సు యాత్రకు ఏర్పాట్లు?
-
Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ సోదాలు
-
TDP: ఎవరెస్ట్ వద్ద ఎగిరిన పసుపుజెండా