Ajit Pawar: అందుకే ఆ హైవేపై ప్రమాదాలు ఎక్కువ.. అజిత్ పవార్‌ వింత వ్యాఖ్యలు

రోడ్డు ప్రమాదాల గురించి స్పందిస్తూ.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(Ajit Pawar) చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. ఇంతకీ ఏం అన్నారంటే..? 

Published : 16 Sep 2023 17:33 IST

ముంబయి: సమృద్ధి-మహామార్గ్‌ ఎక్స్‌ప్రెస్‌పై తరచూ ప్రమాదాలు చోటుచేసుకోవడంపై మహారాష్ట్ర(Maharashtra) ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(Ajit Pawar) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు వింతగా ఉన్నాయి.

ఛత్రపతి శంబాజీ నగర్‌ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరైన అజిత్‌(Ajit Pawar)  విలేకరులతో మాట్లాడుతూ.. ‘సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే రోడ్లు ఎలాంటి వంపులు లేకుండా తిన్నగా ఉంటాయి. అందుకే డ్రైవర్లకు నిద్రమత్తుగా అనిపిస్తుంటుంది. దాంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కారణం ఏదైనా సరే.. ఈ  ప్రమాదాలను కట్టడి చేయాల్సి ఉంది’ అని అన్నారు.

దొంగతనం జరిగిందంటూ ఆనంద్‌ మహీంద్రా పోస్ట్‌.. ముంబయి పోలీసుల అదిరిపోయే రిప్లయ్‌!

ఈ సందర్భంగా ఆయన మరాఠా రిజర్వేషన్ల గురించి మాట్లాడారు. ఈ విషయంలో విపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ‘ఇతర వర్గాల రిజర్వేషన్లను కదపకుండా మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడానికి మా ప్రభుత్వం అనుకూలంగా ఉంది’ అని అన్నారు. కొద్దిరోజుల క్రితం జరిగిన అఖిలపక్ష భేటీలో మరాఠాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. అలాగే ఈ అంశం చట్టపరంగా చెల్లుబాటు అయ్యేలా కృషి చేస్తున్నామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని